Thursday 13 October 2016

Krypton (36)

క్రిప్టాన్ ఒక రసాయనిక మూలకం. మూలకాల ఆవర్తన పట్టికలో 18 వ సముదాయం/సమూహం (group, p బ్లాకు, 4 వ పిరియడుకు చెందిన వాయువు. 18 వ సమూహం లేదా సముదాయానికి చెందిన మూలకాలనుజడ వాయువులు లేదా నోబుల్ గ్యాసెస్ (noble gases ) అనికుడా అందురు.వాతావరణం లోని వాయువులలో అల్ప ప్రమాణంలో క్రిప్టాన్ మూలకం ఉంది.. క్రిప్టాన్ మూలకాన్ని, ద్రవీకరించినగాలి నుండి పాక్షిక స్వేదన క్రియ ద్వారా వేరు చేయుదురు. దీనిని అరుదైన వాయువుల తోపాటుగా ఫ్లోరెసెంట్ దీపాలలో ఉపయోగిస్తారు.

మిగతా జడవాయువు/నోబుల్ వాయువులవలె అలంకరణ విద్యుత్ దీపాలలో, ప్రకటన బోర్డులలో,ఫోటోగ్రఫిలలో ఉపయోగిస్తారు.క్రిప్టాన్ కాంతి అధిక/పెద్ద సంఖ్యలో వర్ణపటగీతలను (spectral lines) కలిగియున్నది.

చరిత్ర

బ్రిటనులో, 1898 సంవత్సరంలో స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త సర్ విలియమ్ రామ్సే, మరియు ఇంగ్లాండుకు చెందిన మోరిస్ ట్రావేర్స్‌లు కనుగొన్నారు. వీరు ద్రవీకరించిన గాలిలోని అన్ని సమ్మేళనాలను/వాయువులను ఇగిర్చి, మిగిలిన శేష పదార్థం నుండి క్రిప్టాన్ వాయువును వేరు చేసారు. ఈ శాస్త్రజ్ఞుల బృందమే కొన్ని వారాల తరువాత ఇదే పద్ధతిలో నియాన్వాయువును ఉత్పత్తి చేసారు. క్రిప్టాన్ తో సహా ఇతర జడవాయువు లను కనుగొన్నందులకు గాను 1904 లో రసాయనిక శాస్త్రానికి సంబంధించిన నోబెల్ బహుమతితో రామ్సేను సత్కరించారు

1960 లో అంతర్జాతీయ తూనికలు మరియు కొలతలు సంస్థ సమావేశంలో క్రిప్టాన్-86 ఐసోటోపు ఉద్గ రించిన/వెలువరించిన 1, 650, 763.73 కాంతి తరంగ దైర్ఘ్యాలదూరాన్ని ఒక మీటరుగా నిర్ణయించారు అయితే అక్టోబరు 1983 సమావేశంలో ఈతీర్మానాన్నిరద్దుచేసి, పీడనరహిత స్థితిలో (వ్యాక్యుం) కాంతి ఒక సెకండులో299, 792, 458 వంతు సమయంలో ప్రయాణించు దూరాన్ని ఒక మీటరుగా నిర్ణయించారు .

పదోత్పత్తి

ఈ మూలకం యొక్క పేరును గ్రీకు భాషలోనిkryptosఅనిపదంనుండి వచ్చింది. క్రిప్టోస్ అనగా దాగిఉన్న అనిఅర్థం

ప్రకృతిలో లభ్యత

జడవాయువులలో ఒక హీలియం మినహాయించి మిగిలినవి భూమిలో లభ్యమగును. భూవాతావరణంలో క్రిప్టాన్ వాయువు యొక్క గాఢత 1 ppm (మిలియను భాగాలకు ఒక భాగం) .అంతరిక్షములోని క్రిప్టాన్ పరిమాణం ఎంత అన్నది ఇదమిద్దంగా తెలియరాలేదు. కాని భారీ ప్రమాణంలోవిశ్వంలో క్రిప్టాన్ ఉన్నదని తెలియవచ్చుచున్నది