Sunday 2 October 2016

Titanium (22)

టైటానియం ఒక మూలకం. దీని చిహ్నం Ti మరియుపరమాణు సంఖ్య 22. ఖగోళ యుగపు లోహముగా కూడా పిలువబడు ఈ లోహమునకు సాంద్రత తక్కువ కానీ ద్రుఢమైనది. వెండి వర్ణపు ఈపరివర్తక (transition) లోహము సముద్రపు నీరు, ఆక్వారీజియా,క్లోరిన్ మొదలగు వాటివలన తుప్పు పట్టదు.

విలియమ్ గ్రెగర్ 1791 లో ఇంగ్లాండులో కొర్న్వాల్లో టైటానియాన్ని కనుగొన్నాడు. గ్రీకు పురాణాలలోని టైటాన్స్ కు గుర్తుగా మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ టైటానియానికి నామకరణం చేసెను.