Sunday 2 October 2016

Calcium (20)

           కాల్షియం (कैल्शियम) ఒక మెత్తని ఊదారంగు క్షార మృత్తిక లోహము. విస్తృత ఆవర్తన పట్టికలో దీని సంకేతము Ca. దీని పరమాణు సంఖ్య 20 మరియు పరమాణు భారము 40.078 గ్రా/మోల్. ప్రకృతిలో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము. కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థలో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు, జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి, బయటకు ప్రయాణిస్తూ, కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు, ఎముకలు మరియు కొన్ని జీవుల (నత్త, అలిచిప్పజాతి జీవుల) పై పెంకుల నిర్మాణంలో కాల్షియం ఉనికి ప్రముఖమైనది.జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో లభ్యమైయ్యే మూలకం కాల్షియం .

చరిత్ర

చరిత్రకు ముందుకాలం నుండే అనగా క్రీ.పూ.14, 000-7000 సంవత్సరాల నాటికే ఇంటి నిర్మాణంలో కాల్షియంను వాడేవారు.అయిన్ ఘజాల్ (Ain Ghazal) లో క్రీ.పూ.7000 సంవత్సరాలనాటి సున్నపుపలాస్త్రీ/లైమ్‌ ప్లాస్టర్‌తో చేసిన విగ్రహం/బొమ్మను గుర్తించారు.ఖపాజా మేసోపోటామియా (Khafajah mesopotamia) లో క్రీ.పూ.2500 నాటి మొదటి సున్నపుబట్టి/సున్నపు ఆవముని గుర్తించారు[ లాటన్ పదం calx, జెణిటివ్ పదం calcis యొక్క అర్థం సున్నం (lime ) . మొదటి శతాబ్దినాటి పురాతన రోమనులు కాల్షియం కార్బోనేట్ నుండి సున్నం తయారు చేసెడివారు.

క్రీ.శ.1808లో ఇంగ్లాండునకు చెందిన సర్ హంప్రీ డేవి అను శాస్త్రవేత్త సున్నం, మేర్క్యురిక్ ఆక్సైడ్‌ల మిశ్రమాన్ని విద్యుద్విశ్లేషణం (electrolysis) కావించి కాల్చియంను వేరు చేసాడు. 20 శతాబ్ది ప్రారంభంవరకు కాల్షియం భారీస్థాయిలో లభ్యం అయ్యేది కాదు.

ఉనికి

కాల్షియం ప్రకృతిలో స్వాభావిక మూలకరూపంలో లభ్యం కాదు. అవక్షేప శిలలలో కాల్సైట్ (calcite) , డోలోమైట్, జిప్సం ఖనిజాల్లో లభిస్తుంది. అంతియే కాకుండగా అగ్నిశిలలు, రూపాంతర శిలలో, ముఖ్యంగా సిలికేట్ ఖనిజాలైన/శైలిత ఖనిజాలైన plagioclases, amphiboles, pyroxenes మరియు garnets లలో కుడా లభ్యం.భూమి ఉపరితలపొరలలో ఈ మూలకం లభ్యత పరిమాణం 4.2%