Sunday 2 October 2016

Sulphur (16)

సల్ఫర్ లేదా గంధకము (Sulfur), ఒక రసాయన మూలకము. దీని పరమాణు సంఖ్య 16. దీని సంకేతముS. ఇది భూమిపై విరివిగా లభించే ఒక అలోహము. ఇదిబహు సంయోజనీయత కలిగిన మూలకము. . ప్రకృతి లో సహజంగా లభ్యమయ్యే సల్ఫర్ పసుపు రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్ధము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగరూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్ధాలకు కావలిసిన అత్యవసర పదార్ధాలలో గంధకం ఒకటి. సిస్టీన్ మరియుమితియోనీన్ అనే రెండు అమినో ఆమ్లాలలో (amino acid) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్ధాలు - ఎరువులు, గన్ పౌడర్, అగ్గిపుల్లలు, పురుగు మందులు, ఫంగస్ నివారణ పదార్ధాలు (insecticides and fungicides). వ్యవహార ఆంగ్ల భాషలో brimstone అని కూడా అంటారు.

కొన్ని సల్ఫర్ వినియోగాలురబ్బర్ వల్కనైజేషన్‌లో సల్ఫర్ ఒక ముఖ్యమైన పదార్థం. ఈ ప్రక్రియలో పాలీ సల్పైడులు ఆర్గానిక్ పాలీమర్‌తో crosslink అవుతాయి.gunpowder తయారీలో సల్ఫర్ వాడుతారుసల్ఫర్, మిథేన్‌ల మధ్య రసాయనిక ప్రక్రియ వలనకార్బన్ డై సల్పైడ్ తయారవుతుంది. దీనిని సెల్లోఫేన్(cellophane) మరియు రేయాన్ (en:rayon) తయారీలో వాడుతారు.[3]మనకు లభించే సల్ఫర్‌లో 85% వరకు సల్ఫ్యూరిక్ ఆమ్లం (sulfuric acid) (H2SO4) తయారీలో వాడుతారు. ప్రపంచంలోని పారిశ్రామిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైన పదార్థం. దేశాల పారిశ్రామిక ప్రగతికి సూచికగా ఆ దేశపు సల్ఫ్యూరిక్ ఆమ్ల వినియోగంను కూడా చెబుతారు.ఎరువుల తయారీ, లోహాల వెలికి తీత, ఖనిజాల శుద్ధి, చమురు శుద్ధి పరిశ్రమలలో ఈ ఆమ్లం వినియోగం ఉంది.డిటర్జెంటులు, పెస్టిసైడులు, ఫంగిసైడులు, వ్యవసాయ రసాయనాలు, రంగు పదార్ధాలు, ఫొటోగ్రఫీ వంటి పదార్ధాలు, పనులలో సల్ఫర్ వినియోగం ఉంటుంది.కొన్ని ఔషధులలో, ముఖ్యంగా చర్మవ్యాధులవివారణలలో సల్ఫర్ ఉపయోగపడుతుంది