Wednesday 27 July 2016

స్వచ్చమైన నీటికి రంగు ఉండదు కాని అదే నీటి తో తయారైన ఐస్ క్యూబ్ లు తెల్లగా ఉంటాయి ఎందుకు ?.

ప్రశ్న:స్వచ్చమైన నీటికి రంగు ఉండదు కాని అదే నీటి తో తయారైన ఐస్ క్యూబ్ లు తెల్లగా ఉంటాయి ఎందుకు ?.

జవాబు:తెలుగుపు అనేది ఒక రంగు కాదు ... అన్ని రంగుల మేలు కలయికే తెలుపు . ఒక వస్తువుగుండా దృశ్య కాంతి లోని ఏడు రంగులు యధేచ్చగా తరిగిపోకుండా పతనమైన (incident) దిశలోనే ప్రసరిస్తే ఆ వస్తువు ను పారదర్శక వస్తువు (TransparentBody) అంటాము . అదే వస్తువు ముక్కలు ముక్కలు గా ఉన్నప్పుడు గానీ .. ఒకే విధమైన అంతర్గత నిర్మాణము లేనపుడు గానీ దాని మీదపడే కాంతి (IncidentLight) పలు దిశల్లో వక్రీభవనం (Refraction) చెంది వివిధ మార్గాల ద్వారా బయటకు వస్తుంది . ఇలా అన్ని వైపూలనుండి తెలుపు కాంతి రావడం వల్ల ఎటు నుంచి చూసినా ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది .

గాజు పలక పారదర్శకం గ కనిపించినా దాన్ని పొడిగా నూరితే సుద్ద పోడిలా తెల్లగా కనిపిస్తుంది . ఇందుకు కారణమూ శ్వేత కాంతి (WhiteLight)పలు దిశల్లో వెదజల్లు కోవడమే (ScatteredLight) . ఐస్ క్యూబ్లలో కుడా వక్రీభవన దిశలు మారి తెల్లని కాంతి పలు మార్గాల్లో బయట కు వస్తుంది . . . అందుకే తెల్లగా కనిపిస్తుంది .

ప్రశ్న: మంచు తెల్లగానే ఎందుకు ఉంటుంది?

జవాబు: తెలుపు ఓ నిర్దిష్ట వర్ణం (specific colour) కాదు. ఇది ఎన్నో వర్ణాల కలయిక. సాధారణంగా ఏదైనా పదార్థంలోని అణువులు (molecules)లేదా పరమాణువులు (atoms) దృశ్య కాంతిలో ఉన్న ఏ రంగు కాంతినీ శోషించుకోలేనట్లయితే ఆ పదార్థం తెల్లగా గానీ, పూర్తి పారదర్శకంగాగానీ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి పదార్థంలో ఉన్న పరమాణువులు స్వచ్ఛమైన స్ఫటికాకృతిలో (crystal structure) ఉన్నా, అణువులు లేదా పరమాణువుల మధ్యన ఖాళీ ప్రదేశం (ద్రవాలు, అణువులలో లాగా) బాగా ఎక్కువగా ఉన్నా ఆ పదార్థాలు పారదర్శకం (transparent) గా ఉంటాయి. కానీ అదే పదార్థంలో ఉన్న అణువులు, పరమాణువులు చిందరవందరగానో, శకలాల్లాగానో (polycrystalline or defective crystalline)ఉన్నట్లయితే ఆ పదార్థాల మీద పడ్డ తెల్లని కాంతి అన్ని వైపులకు పరావర్తనం (reflection) లేదా వ్యాపనం (diffusion) లేదా పరిక్షేపణం (scattering)అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఏ వైపు నుంచి చూసినా మనకు అంతో ఇంతో తెలుపు కాంతి కంటికి చేరడం వల్ల ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. సాధారణంగా మంచుగడ్డలు నిర్దిష్ట స్ఫటికాకృతిలో కాకుండా చెల్లా చెదురుగా ఏర్పడ్డ బహుస్పటిక శకలాలు (poly crystalline segments)గా ఉంటుంది. ఇటువంటి శకలాలమీద పడ్డ కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆ మంచు ముక్కలు తెల్లగా అగుపిస్తాయి.

పక్షులు, జంతువులు అవి పయనించే దిశల విషయంలో భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయని అంటారు. నిజమేనా?

ప్రశ్న: పక్షులు, జంతువులు అవి పయనించే దిశల విషయంలో భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయని అంటారు. నిజమేనా?

జవాబు: వలస పక్షులు, పావురాలు, తాబేళ్లు, సొరచేపలు, తిమింగలాలు వంటివి పయనించే దిశ విషయంలో భూ అయస్కాంత క్షేత్రం (earth magnetic field) సహాయాన్ని తీసుకుంటాయి. ఈ ప్రాణులన్నీ అయస్కాంత కణాలు ఉండే ప్రత్యేకమైన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటాయి. ఈ కణాలు అతి చిన్న ఇనుము లేక నికెల్‌ లోహ కణాల మయం. ఇవి అయస్కాంత సూచి (magnetic compass)లాగా పనిచేస్తాయి. ఏ ప్రాణిలోని ఏ జ్ఞానేంద్రియంలో ఈ అయస్కాంత కణాలు ఉంటాయో అనే విషయం ఇంకా కనిపెట్టవలసి ఉంది. ఆ జ్ఞానేంద్రియంలో జరిగే జీవరసాయన చర్యలను అవగాహన చేసుకొనే దిశలో పరిశోధనలు జరుగుతున్నాయి.

వలసపోయే పక్షుల విషయంలో ఈ అయస్కాంత సంబంధిత జ్ఞానం వాటి కుడికంటిలో ఉన్నట్లు అధ్యయనం ద్వారా తెలిసింది. కుడికన్ను గ్రహించిన సమాచారం మెదడులోని ఎడమభాగంలో క్రమబద్ధీకరింపబడి, ఆ ఆలోచనతో కాంతి గ్రాహకాల (light sensors) ను ప్రేరేపించడం ద్వారా పక్షులు అయస్కాంత క్షేత్రాలను పసిగట్టగలుగుతాయి.

సొరచేపలలో ఈ అయస్కాంత ఇంద్రియం వాటి ముక్కులలో ఉంటుంది. ఇది విద్యుదయస్కాంత క్షేత్రాలను కనిపెట్టే అతి సున్నితమైన 'ఏరియల్‌'లాగా పనిచేస్తుంది. సొరచేపలు ఒక 'వోల్ట్‌' లోని పదిలక్షలవ వంతు విద్యుత్‌ పొటన్షియల్‌ను కూడా కనిపెట్టగలవన్నమాట. ఈ విధంగా పక్షులు, జంతువులు భూ అయస్కాంత క్షేత్ర ఉనికిని కనిపెట్టి దిశానిర్దేశం చేసుకోగలవు.

www.bhaskerdesh.in

కేవలం గాలిని ఉపయోగించి కారుని నడిపారని పత్రికల్లో చదివాను. ఇదెలా సాధ్యం?

ప్రశ్న: కేవలం గాలిని ఉపయోగించి కారుని నడిపారని పత్రికల్లో చదివాను. ఇదెలా సాధ్యం?

జవాబు: సాధారణంగా వాహనాలు పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాలలోని రసాయనిక శక్తిని తమ అంతర్దహన యంత్రాంగం (internal combustion mechanism) ద్వారా యాంత్రిక శక్తిగా మార్చుకుని పని చేస్తాయి. ఈమధ్య వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ యాంత్రిక పద్ధతుల్లో వాహనాలను నడిపే ప్రక్రియలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటివే ఈ వాయు చోదక వాహనాలు. మామూలు గాలిని ప్రత్యేక మోటార్ల ద్వారా సిలండర్లలో అధిక పీడనంతో నింపుతారు. వీటి మూతులకు ప్రత్యేకమైన రెగ్యులేటర్లను అమర్చడం ద్వారా కావలసిన పీడనం, వేగాలతో బయటకి పంపే ఏర్పాటు ఉంటుంది. ఇలా అత్యధిక ఒత్తిడితో బయటకి వచ్చే గాలి టర్బైన్‌ను తిప్పే విధంగా అమరిక ఉంటుంది. అంటే వాయుశక్తి యాంత్రిక శక్తిగా మారుతోందన్నమాట. ఈ టర్బైన్‌కు అనుసంధానంగా చక్రాల ఇరుసులను అమర్చడం వల్ల అవి తిరిగి కారు ముందుకు కదులుతుంది. ఇలాంటి ఇంజిన్లను వాయుచలన యంత్రాలు (Pneumatic engines) అంటారు.

www.bhaskerdesh.in

Saturday 23 July 2016

టీవీ తెరపై దుమ్మును గుడ్డతో తుడిచేప్పుడు మన చేతి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకని?

ప్రశ్న:
టీవీ తెరపై దుమ్మును గుడ్డతో తుడిచేప్పుడు మన చేతి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకని?

జవాబు:
అది స్థిర విద్యుత్‌ (static electricity) ప్రభావం. ప్రతి పదార్థంలో పరమాణువులు ఉంటాయి. వాటి కేంద్రకం (nucleus)లో ధనావేశంతో ఉండే ప్రోటాన్లు, ఏ ఆవేశం లేని న్యూట్రాన్లు కట్టగట్టుకుని ఉంటే, ఆ కేంద్రకం చుట్టూ రుణావేశం ఉండే ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒక పరమాణువులో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయో, అన్నే ఎలక్ట్రాన్లు ఉంటాయి. కేంద్రకం నుంచి దూరంగా ఉండే కక్ష్యలో తిరిగే ఎలక్ట్రాన్లపై కేంద్రకం ఆకర్షణ ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఇక టీవీ తెర విషయానికి వస్తే, దాన్ని ఏదైనా గుడ్డతో తుడిచేప్పుడు తెరమీది పరమాణువులు, గుడ్డలోని పరమాణువుల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణశక్తిని తెర పరమాణువుల బాహ్య కక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్లు గ్రహించి, తెర నుంచి విడివడి గుడ్డలో ఉండే పరమాణువుల బాహ్య కక్ష్యను చేరుకుంటాయి. ఎలక్ట్రాన్లను కోల్పోయిన తెర ఉపరితలపు పరమాణువులలో ధనావేశం ఉండే ప్రోటాన్ల సంఖ్య ఎక్కువవడంతో తెర ధన విద్యుదావేశాన్ని పొందుతుంది. ఎలక్ట్రాన్లను పొందిన గుడ్డ రుణ విద్యుదావేశాన్ని పొందుతుంది. మనం వాడే గుడ్డ స్వభావాన్ని బట్టి ఈ విద్యుదావేశాలు తారుమారు కూడా కావచ్చు. అంటే ఏదైనా రెండు పదార్థాలను ఘర్షణకు గురి చేస్తే వాటికి విద్యుదావేశం వస్తుంది. అలా ధన విద్యుదావేశం పొందిన తెర ఉపరితలం తిరిగి తన యధాస్థితిని పొందడానికి మన చేతిపై ఉండే పరమాణువుల ఉంచి ఎలక్ట్రాన్లను గ్రహించే ప్రయత్నం చేస్తుంది. అందువల్లనే చేతి మీది వెంట్రుకలు తెరవైపు లాగినట్టయి నిక్కబొడుచుకుంటాయి. గాలి నింపిన బెలూనును బాగా రుద్ది వదిలేసినా అది మన దేహానికి అంటిపెట్టుకుని ఉంటుంది. దీనికి కూడా కారణం ఇదే.

గరాటుతో ఒక సీసాను నీటితో నింపేప్పుడు తరచూ గరాటును కొంచెం పైకి ఎత్తవలసి వస్తుంది. ఎందుకు?

ప్రశ్న: గరాటుతో ఒక సీసాను నీటితో నింపేప్పుడు తరచూ గరాటును కొంచెం పైకి ఎత్తవలసి వస్తుంది. ఎందుకు?

జవాబు: గాలి, నీరు ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉండే ప్రదేశంలోకి ప్రవహిస్తాయి. సీసా మూతిపై గరాటును పెట్టి నీరు పోసినప్పుడు కొంత నీరు సీసాలోకి పడుతుంది. అంతవరకు అక్కడున్న గాలి సీసాలోంచి తప్పించుకుపోడానికి గరాటు అడ్డంగా ఉండడంతో నీటిలో కలిసిపోతుంది. అలా నీరు పోసేకొలదీ, సీసాలోని గాలి నీటిలో కలిసిపోతుండంతో ఒక దశలో సీసా బయట ఉండే గాలి పీడనం కన్నా, సీసాలోని పీడనం ఎక్కువవుతుంది. అందువల్ల ఆపై గరాటులో పోసే నీరు లోపలికి దిగకుండా ఈ పీడనం నిరోధిస్తుంది. అప్పుడు గరాటును కొంచెం పైకి ఎత్తితే సీసాలోని గాలి కొంత బయటకు తప్పించుకుపోతుంది. అప్పుడు సీసాలోపలి పీడనం బయటి పీడనం కన్నా తక్కువ అయి నీరు సాఫీగా దిగుతుంది.

వాతావరణంలోని తేమను ఎలా కొలుస్తారు?


 
ప్రశ్న: వాతావరణంలోని తేమను ఎలా కొలుస్తారు?

జవాబు: గాలిలో ఉండే తేమను ఆర్ద్రత అంటారు. ఈ ఆర్ద్రతను రెండు విధాలుగా విభజింపవచ్చు. ఒకటి పరమ ఆర్ద్రత. రెండోది సాపేక్ష ఆర్ద్రత. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను పరమ ఆర్ద్రత అంటారు. ప్రస్తుతం ఉండే ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను సంతృప్తీకరణం చేయడానికి కావలసిన తేమ శాతాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటారు.

ఆర్ద్రతను హైగ్రోమీటర్‌ అనే పరికరంతో కొలుస్తారు. ఈ హైగ్రోమీటర్లు హెయిర్‌ హైగ్రోమీటర్‌, కెపాసిటివ్‌ హైగ్రోమీటర్‌ అని రెండు రకాలు. సాపేక్ష ఆర్ద్రతను కొలిచే హెయిర్‌ హైగ్రోమీటర్‌లో వెంట్రుకలు ఒక కుచ్చు రూపంలో ఉంటాయి. గాలిలో తేమను పీల్చుకున్నపుడు ఆ వెంట్రుకలు సాగుతాయి. అపుడు పరికరంలో ఉండే అతి సున్నితమైన యాంత్రిక వ్యవస్థ వెంట్రుకల పొడవులోని మార్పును ఒక స్కేలుపై చలనంలో ఉండే సూచికకు అందజేస్తుంది. స్కేలుపై ఆర్ద్రతల విలువలు విభాగాల రూపంలో ఉంటాయి. ఉష్ణోగ్రతలలో స్వల్ప మార్పులను సునిశితంగా గ్రహించే సామర్థ్యం ఉండటం వల్ల స్త్రీల తల వెంట్రుకలను ఈ పరికరంలో వాడతారు.

పరమ ఆర్ద్రతను కొలిచే కెపాసిటివ్‌ హైగ్రో మీటర్‌లో గాలిలోని ఆర్ద్రతను కొలవడానికి విద్యుచ్ఛక్తిని వాడతారు. ఈ పరికరంలో ఒక కండెన్సర్‌ ఉంటుంది. కండెన్సర్‌లో సమాంతరంగా ఉండే విద్యుత్‌ వాహకాలైన రెండు పలకల మధ్య ఉండే టెన్షన్‌ మార్పుల ఆధారంగా ఆర్ద్రతను కొలుస్తారు. ఆర్ద్రత అంటే గాలిలో తేమ తగ్గే కొలదీ కండెన్సర్‌ పలకల మధ్య టెన్షన్‌ తగ్గుతుంది.

ఫిలమెంట్ బల్బు కన్నా ట్యూబ్ లైట్లు ఎక్కువ కాంతినిస్తాయి ఎందుకని?

ప్రశ్న: ఫిలమెంట్ బల్బు కన్నా ట్యూబ్ లైట్లు ఎక్కువ కాంతినిస్తాయి ఎందుకని?
TubeLight gives more light than filment Bulb..Why?

జవాబు: ఒకే సామర్ధ్యం ఉండే ఫిలమెంట్ బల్బుల కన్నా మెర్క్యురి లేదా సోడియం వాయువులు నింపిన ట్యూబ్ లైట్లు ఎక్కుమ కాంతిని అందిస్తాయి . ఏదైనా పదార్ధం గుండా విధ్యుత్ ప్రవహించినపుడు ఉష్ణ శక్తి , కాంతి శక్తి వెలువడతాయి . ఫిలమెంట్ బల్బు లో విద్యుత్ ఒక సన్నని' టంగ స్టన్ ' తీగ ద్వార ప్రవహించినపుడు ఎక్కువ కాంతి ఉత్పన్నమవుతున్నా , కొంత శక్తి ఉష్ణము గా మారి వృదా అవుతుంది . ఫిలమెంట్ ఉపరితల వైశాల్యము , పొడవుల పై కాంతి శక్తి ఆధారపడి ఉంటుంది .

వాయువులు నింపి ఉండే ట్యూబ్ లైట్ల లో ఎలేక్త్రాన్లు రుణధ్రువము నుండి ధనద్రువానికి ప్రవహిస్తాయి .ఈ వాయువుల అణువులు విద్యుద్వాహ కాలు(conductors) కాబట్టి వాటి గుండా పయనించే ఎలేక్ట్రోన్స్ కాంతి ని వెలువరిస్తాయి . ఈ ప్రక్రియలో ఉష్ణ శక్తి వెలువడే ప్రశ్నే ఉండదు . పైగా కాంతి వెలువడే ప్రదేశపు ఘనపరిమాణము కుడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్యూబ్ లైట్ ... ఫిలమెంట్ బల్బు కన్నా ప్రకాశవంతం గా వెలుగుతాది .

ఫ్యానుకు సాధారణంగా మూడు రెక్కలే ఉంటాయి. ఎందుకు?

ప్రశ్న: ఫ్యానుకు సాధారణంగా మూడు రెక్కలే ఉంటాయి. ఎందుకు?

జవాబు: ఫ్యానుకు ఒకే రెక్క ఉండడం వీలు కాదు కాబట్టి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగని రెక్కలు మరీ ఎక్కువయితే వాటి మధ్య ఎడం తక్కువైపోతుంది. ఫ్యాను చేసే పనే తన వెనుక గాలిని రెక్కల ద్వారా ముందుకు నెట్టడం. అలాంటప్పుడు రెక్కల మధ్య ఎడం తక్కువైతే గాలి త్వరితంగా ముందు వైపునకు రాలేదు. కాబట్టి మధ్యే మార్గంగా మూడు రెక్కలతో సర్దుకోవడం ఆనవాయితీ. పెద్దపెద్ద సభల్లోనూ, పెళ్లిపందిళ్లలోనూ తీవ్రమైన వేగంతో గాలిని దూరంగా నెట్టే తుపాన్‌ ఫ్యాన్లకు రెండే రెక్కలు ఉంటాయని గమనించండి. కొన్నిచోట్ల నాలుగు రెక్కల ఫ్యాన్లు కూడా ఉంటాయి. బాత్‌రూంలు, వంటగదులు వంటి గదుల్లోంచి అవాంఛనీయ వాయువుల్ని బయటికి నెట్టే (exhaust) ఫ్యాన్లకు ఐదు, లేదా ఆరు రెక్కలు కూడా ఉండడం కద్దు. సైద్ధాంతికంగా ఫ్యాను రెక్కలు ఒకటికన్నా ఎక్కువ ఉండాలన్నదే రూఢి అయిన విషయం. ఇక వేగం, అవసరాల ఆధారంగా రెక్కల సంఖ్య మారుతూ ఉంటుంది.

మీకు తెలుసా?

💐💐  *మీకు తెలుసా?*💐💐

🏜 ప్రపంచమంతా కలిపి 100 కు పైగా రకాల  కాకులు ఉన్నాయి.ఇవి చాలా తెలివైన పక్షులు.చేతిలో తుపాకీ పట్టుకున్న వ్యక్తిని గుర్తుపడతాయి.

🏜 పులి తన శరీర బరువులో 5వ వంతు ఆహారాన్ని ఒక్కపుటలో తినేస్తుంది.

🏜 స్రుష్టిలోని జివరాసులలో  కెల్లా అత్యంత భారీ బిడ్డను కనే జంతువు "తిమింగళo".

🏜 జమైకా ద్వీపంలో 120 నదులున్నాయట.

🏜 సెల్ ఫోన్ వాడకంలో "NOKIA"  మనకు బాగా పరిచయమైంది.ఫిన్లాoడ్ లోని ఓ ప్రదేశం.ఆ పేరు మీదనే బ్రాండ్ ఏర్పడింది.

🎊 బ్రెజిల్ దేశం దక్షిణ అమెరికా ఖండంలో సగభాగంలో విస్తరించింది.

🎊 దేహంలో ఉండే ఏముకల్లో పావువంతు పాదాల్లోనే ఉంటాయి.

🎊 ప్రాణులను కుట్టి రక్తం పిల్చేది ఆడ దోమలు మాత్రమే.

🎊 ఇంగ్లీష్ భాషలో అత్యంత పురాతనమైన పదం "TOWN"

🎊 ఈఫిల్ టవర్లో మొదటి అంతస్తుకి 347,2వ అంతస్తుకి 674 మేట్లుoటాయి.చిన్న చిన్న ఫ్లాట్ ఫామ్ లన్నీ కలిపి 1710 మెట్లుoటాయట.

⚛ జిరాఫి నాలుక 21 అంగుళాల పొడవు ఉంటుంది.అది నాలుకను చాచి చెవుల్ని శుభ్రం చేసుకుంటుంది.

🔯 నిమ్మకాయల్లో చెక్కర  ఉండదు అనుకుంటాo.కానీ స్ట్రాబెర్రీల కంటే నిమ్మకాయల్లోనే ఎక్కువ చక్కర ఉంటుంది.

🔯ఒలంపిక్ పతాకాన్ని 1914 లో బరోన్ పియరె డి కౌబెర్టిన్ తయారుచేసారు.

🔯 ప్రయాణికుల రవాణాలో ప్రపంచంలోనే అతి పెద్ద గాలిమోటర్ ఎయిర్ బస్ కంపెనికి చెందిన A-380 విమానమే.ఇందులో మొత్తం 853 మంది ప్రయాణించుటకు వీలుంటుంది.

✡ కాఫీ పుట్టింది ఇధియోపియాలోని కఫ్ఫా(kaffa) అనే ప్రాంతంలోనే.కల్ది అనే కాపరి తన మేకలు కాఫీ మొక్కల్ని తిని ఉత్సాహంతో గంతులువేయడం గమనించి వీటిని గుర్తించాడు.

🌺న్యూజిలాండ్ లో 4 మిలియన్ల ప్రజలుoటే,అక్కడ గొర్రెల సంఖ్య 70 మిలియన్లు.

🌺క్యారెట్లలో కొవ్వు పదార్ధాలు అసలే ఉండవు.0% FAT

🌺వేడినీటిలో TEA బ్యాగ్ వేసుకోవడం అత్యాధునికం అనుకుంటున్నాం కదా! TEA బ్యాగ్ తయారై 100 ఏళ్ళు దాటింది.నిజం మెదటి 1908 లో తయారైంది.

🌺సగటు మనిషి తన జీవితంలో భూమిని 5సార్లు చుట్టి వచినoత దూరం నడుస్తాడట.

🌺తాజ్ మహల్ ను ఏడాదికి 70 నుంచి 80 లక్షల మంది టూరిస్టులు సందర్శిస్తారట.

🍋ఉడుత జీవితకాలం కేవలం తొమ్మిదేళ్ళు.

🍋underground ఈ పదాన్ని గమనించండి und..తో మొదలై und..తో పూర్తవుతుంది.

🍋ఈము పక్షి వెనక్కు ఒక్క అడుగు కూడా వేయలేదు.ఈ పక్షులు వెనక్కు నడవలేవు.

🍋నీరు ద్రవరూపంలో ఉన్నప్పటి పరిమాణం కంటే గడ్డకట్టినపుడు 9% పెరుగుతుంది.

🍋ప్రతి 2 గంటలకు ఒక ఇంగ్లీష్ పదం Dictionary లో చేరుతుంది.

🌺అమెరికన్లు ఒక రోజులో తినే పిజ్జాలను నెలమీద పరిస్తే 100 ఎకరాల స్థలం ఆక్రమిస్తాయట.

🌺కుక్క జీవితకాలం 10-14 సంవత్సరాలు.

🌺ప్రపంచంలో మొత్తం 54 రకాల కోకిలలు ఉన్నాయి.మగ కోకిలలు పాడలేవు.'కూ'అన్న కూత పెట్టేది కేవలం ఆడకోయిలలే.

🌺యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ లో SCIENCE,MATHS తప్ప అన్ని సబ్జెక్ట్లలో ఫెయిల్ అయ్యారట మన ఐన్ స్టీన్.

🌺నీరు త్రాగకుండా ఉండే జంతువు అనగానే ఒంటె గుర్తొస్తుంది.కానీ జిరాఫి,ఎలుకలు అంతకంటే ఎక్కువ రోజులు నీటిని తాగకుండా జీవించిగలుగుతాయి.

🌺క్యాన్సర్ వ్యాధి బారిన పడని జంతువు షార్క్ చేప ఒక్కటేనట.

🌺నీళ్ళు ఉన్న విషయాన్ని ఏనుగులు 3 మైళ్ళ దూరం నుండే పసిగడతాయట.

🌺ఎలుగుబంటిని చూసి మనం భయపడతా.కానీ ఎలుగుబంటి మాత్రం పిల్లిని చూస్తే భయంతో పాతుపోతుందట!

🌺95% మంది అధిక బరువుతో ఉండటం వల్ల 'నౌరు'  దేశాన్ని "ఫ్యాటెస్ట్ నేషన్" గా పిలుస్తారు.

🌺ఆవులు కనుగుడ్లను అన్ని వైపులకు గుండ్రంగా తిప్పగలవు.రోజుకు 35 గ్యాలన్ల(1 గ్యాలన్=3.8 లీటర్లు) నీరు తాగుతాయి.

☄ షూ లేసుకు రెండు చివర్లా ఉండే చిన్న ప్లాస్టిక్ ముక్కలను "అగ్లేట్స్" అంటారట!

☄ఉష్ట్రపక్షి(అస్ట్రిచ్)చిన్నప్రేగు 46 అడుగుల పొడవుoటుoదట!

☄ మనం తేనెను తాగితే 20ని!! ల్లో అది రక్తంలో పూర్తిగా కలిసిపోతుందట!

☄ మొదటిసారి కెమెరాను కనుక్కున్నప్పుడు ఒక ఫోటో తీయించుకోవడానికి 8గంటలు కుర్చోవాల్సి వచెదట!

☄పిచ్చుకలు కేవలం 14-16 సెం.మీ ఎత్తు,27-39 గ్రాముల బరువు కలిగివుండి,గంటకు 24 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయట!

👁‍🗨 ప్రపంచంలో టీవీలు అత్యధికంగా ఉన్న దేశం చైనా.అక్కడ దాదాపు రెండు వందల మిలియన్ల TV లు ఉన్నాయట❕

👁‍🗨 క్యారెట్లు మరీ ఎక్కువగా తింటే చర్మం ముదురు పసుపు రంగులోకి మారుతుందట. దీనిని "కేరొటెనేమియా" అంటారు❕

👁‍🗨 బార్బీ డాల్ పూర్తి పేరు...
బార్బారా మిలిసెంట్ రాబర్ట్ ❕

👁‍🗨 అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం నాడు క్యాబేజీలు అమ్మకూడదనే చట్టం ఉందట❕

👁‍🗨 మగ హిప్పోపోటమస్ ను "బుల్" అనీ,ఆడదాన్ని "కౌ" అనీ,పిల్లలను "కాఫ్" అనీ అంటారు❕

💎 మన దేహంలో ఎక్కువ ముడతలు పడి ఉండే భాగం మెదడు.దానిని విడదీసి పరిస్తే దిండు మేర విస్తరిస్తుంది.

💎 సింహాలకు చూపు రాత్రిళ్ళు చాలా చురుగ్గా ఉంటుంది.మనుషుల పగటి చూపుతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ.

💎 తల్లిపాలలో ఉండే పోషకాలన్నిoటిని కలిగి ఉన్న ఆహారం ప్రపంచంలో మరొకటి లేదు.

💎 ప్రపంచంలో అత్యధికంగా విద్యార్ధులు చదువుకుంటున్న పాఠశాల లక్నోలోని "సిటీ మాంటిస్సోరి స్కూల్".అందులో 45 వేలకు పైగా విద్యార్ధులు చదువుకుంటున్నారు.

💎 మహిళలు పురుషుల కంటే 2 రెట్లు ఎక్కువగా కనురెప్పలు కొడతారట!

💃� అరటిపళ్ళలో విటమిన్ C,B6 ల తో పాటు పోటాషియం కూడా అధికంగా ఉంటుందట!

💃� పొద్దున్న లేచిన వెంటనే కాఫీ తాగటం కంటే ఒక యాపిల్ తింటే బద్దకం త్వరగా వదులుతుందట!

💃�క్యాబేజీ రసం తాగితే పేగుల్లో ఏర్పడిన పుండ్లు నయమౌతాయట!

💃�టమాటాలో ఉండే "లైకోపిన్" అనే పదార్ధం ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది!

💃 ఫలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని "పోమాలజీ" అంటారు.

📖 1982 లో కంప్యూటర్ ను ప్రముఖ టైమ్ మ్యాగజైన్ "మ్యాన్ అఫ్ ది ఇయర్ గా ప్రకటించింది.

📖 అలారం కనిపెట్టిన కొత్తలో ఉదయం 4 గంటలకు మాత్రమే అలారం పెట్టుకునే సౌకర్యం ఉండేదట!

📖 ఇటలీ భాషలో టమాటోని "పొమొడొరో" అంటారట!

📖 జామపండులో విటమిన్ "C" కమలాపండు కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

📖 సీతాకోకచిలుకలు మరీ ఎక్కువ దూరం చూడలేవు.కేవలం పది నుంచి పన్నెండడుగుల దూరంలో ఉన్న వాటిని మాత్రమే చూడగలుగుతాయి!

*💥💥TPUS ALLADURG💥💥*

🌼 షేక్ స్పియర్ నాటకాల్లో దాదాపు 13 నాటకాల్లోని పాత్రలు ఆత్మహత్య చేసుకున్నాయి!

🌼 ప్రపంచంలోని మిలియనిర్ల లో 80 శాతం మంది సెకండ్ హ్యాండ్ కార్లు వాడుతున్నారని ఒక సర్వేలో తేలిందట!

🌼 ఖడ్గమ్రగానికి కోపమొస్తే దాని చెమట ఎరుపు రంగులోకి మారిపోతుందట!

🌼 ఎప్పుడైనా గమనించారా?యాపిల్ పండు నీళ్ళలో మునగదు.ఎందుకంటే అందులో 25 శాతం గాలే ఉంటుంది.

🌼 గొడుగును ఈజిప్ట్ లో క్రీ.పూ.3500 ఏళ్ళ కిందట ఉపయోగించారు.అప్పట్లో వాళ్ళు ఎండకు రక్షణగా తాటాకు గొడుగును వాడేవారు.

🌱 పొగ తాగే అలవాటున్నవారు,సాధారణ చురుకుదనం పొందడానికి మామూలు కంటే ఒక గంట ఎక్కవ నిద్ర అవసరమౌతుందట!

🌱ఒక్క నారింజ విత్తనం నుండి ఒక్కోసారి ఒకటికంటే ఎక్కువ మొక్కలు మొలుస్తాయట!

🌱తేనె త్వరగా ఎందుకు జీర్ణం అవుతుందో తెలుసా?అది అప్పటికే తేనేటిగ కడుపులో జిర్నమైపోయిన పదార్ధం కాబట్టి!

🌱మొనాలిసా చిత్రకారుడు లియోనార్డొ డావిన్సి ఒకేసారి ఒక చేత్తో రాస్తూ మరో చేత్తో పెయింటింగ్స్ వేయగలడట.

🌱పెట్రోలియం అనే పదం గ్రీకు భాష నుండి వచిన్ది.పెట్రో అంటే రాయి అని.ఓలియo అంటే నూనె అని అర్ధమట!

🎑 ద్రాక్షపళ్ళ గింజలలో అత్యధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట!

🎑అమెరికాలో నమోదయ్యే కేసుల్లో 50%నికి పైగా యాక్సిడెంట్ కేసులేనట!

🎑అనకొండ ఎదుగుదల ఆగదు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి.వీటి జీవితకాలం 10-12 ఏళ్ళు.కొన్ని 30 ఏళ్ళ వరకు కూడా జీవిస్తాయ

🎑మనిషి ముక్కు 50 వేల రకాల పరిమళాలను గుర్తిస్తుంది.అయితే కాలుష్యం బారిన పడి నాసికాపుటలు సున్నితత్వాన్ని కోల్పోకపోతేనే అది సాధ్యం.

*www.bhaskerdesh.in*

〽 పుచ్చకాయలో అధికశాతం నీరే ఉంటుందన్నది తెలిసిందే.అయితే అందులో విటమిన్ 'C' తో పాటు,6% చక్కర కూడా ఉంటుందట!

〽 యుక్తవయసులో ఉన్న స్త్రీలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే "పాలి సిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్" బారిన పడతారట!

〽1928 లో మొదటిసారి  కార్టూన్ బొమ్మల్లో, యానిమేషన్లలో ఎలుకను ప్రవేశపెట్టారు.దానిపేరే "మిక్కీమౌజ్"

〽 దోమలు 'O' బ్లడ్ గ్రూప్ రక్కాన్నే ఎక్కువ ఇష్టంగా పిల్చేస్తాయట!

〽 ఆలివ్ చెట్లు సుమారు 3 వేల సం!! వరకు జివిస్తాయట!

1. _బీట్ రూట్ ను మరిగించిన నీటితో తల రుద్దుకుంటే చుండ్రు తగ్గిపోతుందట!_

2. _కెనడా అంటే పెద్ద గ్రామం అని అర్ధం_

3. _శరీరంలో సరిపడేంత ఫోలిక్ యాసిడ్ లేకపోతే డిప్రెషన్ కు గురౌతారట.పాలకూర తింటే ఆ సమస్యే రాదట._

4. _పిల్లి చెవిలో 32 కండరాలు ఉంటాయి.అందుకే అది చిన్న శబ్దాన్ని కూడా వినగలుగుతుంది._

5. _నిప్పు కోళ్ళు గుర్రాల కంటే వేగంగా పరిగెడతాయి.అంతేకాదు మగ నిప్పు కోళ్ళు సింహాల్లాగే గర్జిస్తాయి._

1. _ప్రపంచంలో ఎక్కువమంది ఆగస్టు నెలలో పుట్టినవారే._

2 _.ప్రపంచంలో 11 శాతం మంది ప్రజలు ఎడమ చేతి వాటం వారే._

3. _ఏ రెండు మొక్కజొన్న కంకులు ఒకేలా వుండవు._

4. _టీ,కాఫీ లో ఉండే కొన్ని రసాయనాలకు పోషకాలను హరించే శక్తి ఉందట.అందుకే భోజనం చేసిన వెంటనే వాటిని తాగవద్దంటారు వైద్యులు!_

5.ఈము పక్షులు నీళ్ళు అధికంగా తాగుతాయి.ఒక్కసారి తాగడం మొదలుపెడితే  10 నిమిషాల
పాటు తాగుతూనే ఉంటాయి.

*www.bhaskerdesh.in*

💐💐💐💐💐💐💐💐💐💐💐
1. _మగాళ్ళు తమ జీవిత కాలంలో దాదాపు  3వేల గంటలు షేవింగ్ కు కేటాయిస్తారు!_

2. _ప్రపంచంలో 70 వేల రకాల సాలీళ్లులున్నాయి!_

3. _బంగాళదుంప ముక్కలను  ఎముకలు విరిగినచోటు ఉంచితే.ఎముకలు అతుక్కోవడానికి దోహదపడుతుంది!_

4. _ఆరోగ్యకరమైన ఆవు తన జీవితకాలంలో రెండు లక్షల గ్లాసుల పాలు ఇస్తుంది!_

5. _1666 లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో లండన్ నగరం సగానికి పైగా తగలబడిపోయింది.కానీ 6రు గురు మత్రమే గాయపడ్డారు!_

*💥💥TPUS ALLADURG💥💥*

👉� _మిగిలిన జంతువులన్నిటి పాల కంటే ఒంటెపాలు తేలికగా జీర్ణమౌతాయి!_

👉� _ఒక్క కింగ్ కోబ్రాలో ఉండే విషం ముప్పై మంది ప్రాణాలు తీస్తుంది!_

👉� _మేక కనుపాపలు చతురస్రాకారంలో ఉంటాయి!_

👉� _గొర్రెలకు జ్ఞాపకశక్తి ఎక్కువ ఒక 50 మంది మనుషులను వరుసగా చూపించినా...అందరినీ గుర్తుపెట్టుకోగలవని పరిశోధనల్లో తేలింది!_

👉� _ఖడ్గమ్రగం శాకాహార జంతువు.దీని కొమ్ము బరువు 500-700 గ్రాములు.గర్భదారణ సమయం 15-16 నెలలు!_

*www.bhaskerdesh.in*

👉� _సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి యూరెనస్ కి 84 ఏళ్ళు పడుతుంది.అంటే అక్కడ పగలు 42 గంటలు,రాత్రి 42 గంటలు ఉంటుందన్నమాట!_

👉� _చికెన్లో ఉండే అమైనో ఆమ్లము మ్యూకస్ ను బలపరుస్తుంది!_

👉� _మనం కొద్ది నిమిషాల్లో భోజనం చేసేస్తాo.కానీ అది పూర్తిగా జీర్ణం కావడానికి 12 గంటలు పడుతుంది!_

👉� _అప్పుడే అరటిపండు తిన్న వ్యక్తికి దోమలు ఎక్కువగా ఆకర్షితమావుతాయట!_

👉� _చాలా వరకు పీతలు ముందుకు,వెనక్కి నడవగలవు.అంతేకాదు కొన్ని ఈత కూడా కొట్టగలవు!_

*www.bhaskerdesh.in*

👉సోయాబీన్స్ ఎక్కువగా తీసుకునే స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది!

👉మనం ఒక్క అడుగు వేయడానికి శరీరంలోని 200 కండరాలు కదలాల్సి వస్తుంది!

👉1845 లో బ్రిటన్లో ఓ చట్టం వచ్చింది.దాని ప్రకారం ఆత్మహత్య ప్రయత్నం చేసినవాళ్ళకి మరణశిక్ష విధించేవారు!

👉ఫ్రూట్ఫ్ ఫ్లై అనే కీటకానికి ఏదైనా ఇన్ఫేక్షన్ వస్తే,అది బాగా మద్యం సేవించి కడుపులోని ఆహారాన్ని బయటకు పంపించి తనని తాను రక్షించుకుంటుంది.

👉నీటిమీద తేలే పోస్టాఫీసు మన దేశంలోనే ఉంది తెలుసా? కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్లోని దాల్ సరస్సులో 2011 లో దీన్ని ప్రారంభించారు.

*www.bhaskerdesh.in*

➡  _జిబ్రాలు నారింజ రంగును గుర్తించలేవు!_

➡ _ఆవు పాలలో కంటే మేక పాలలో క్రోవ్వు పదార్ధాలు ఎక్కువగా !ఉంటాయి.

➡ _అల్లం.ఉల్లి...ఈ రెండు ఫ్లూ కారకాలను తరిమేస్తాయి!_

➡ _ఒక మనిషి తన జీవితకాలం లో దాదాపు 1,460 కలలు కంటాడు!_

➡ _ఒంటెకు కోపమొస్తే గట్టిగా  ఉమ్మేస్తుoది !_

*www.bhaskerdesh.in*

📝 మిగిలిన అన్ని గ్రహాలూ కలిపితే ఎంత ఉంటాయో,అంతకంటే పెద్దగా ఉంటుంది బృహస్పతి!

📝 మన నాలుకపై ఉండే రుచిమొగ్గల జీవితకాలం కేవలం 10 రోజులు మాత్రమే!

📝 డావించీ చిన్నప్పుడే  డిస్లేక్సియా వ్యాధి బారిన పడడంతో అప్పుడప్పుడు అక్షరాలను వెనక నుండి ముందుకు రాస్తుండేవాడు!

📝 నత్త ప్రమాదవశాత్తూ కంటిని  కోల్పోయినట్లయితే శాశ్వతంగా గుడ్డిదానిలా ఉండిపోదు.తిరిగి కొత్త కన్ను ఏర్పడుతుంది.మనకు గోరు ఉదిపోయినా తిరిగి వచ్చినట్టన్నమాట!

📝 ప్రపంచంలో ఉన్న లక్షలాది చెట్లు ఉడతల వల్లనే మొలిచాయి.ఉడతలు పండును తిన్న తరువాత గింజను భూమిలో నాటుతాయి.

*www.bhaskerdesh.in*

🔹గర్భంలో ఉన్న బిడ్డకు మూడు నెలలు వచ్చినప్పటి నుంచి ఫింగర్ ప్రింట్స్ తయారౌతాయి!

🔹వరల్డ్ వైడ్ వెబ్(www) అన్న మాటను 1990 లో టీమ్ బెర్నర్స్ లీ కనిపెట్టాడు!

🔹ఇంటెర్నెట్ లో మొట్టమొదటి కామిక్ వెబ్ సైట్...డిల్బర్ట్ జోన్!

🔹ఆరోగ్యకరమైన మనిషి సంవత్సరంలో 62 లక్షల సార్లకు పైగా కళ్ళార్పుతాడు !

🔹మైక్రోఫోన్ ను 1876 లో ఎమిలీ బేర్లైనర్ కనుగొన్నాడు!

*www.bhaskerdesh.in*