Thursday 13 October 2016

Zinc(30)


మౌలిక సమాచారం

తుత్తునాగం లేక జింకు (zinc) అనునది ఒక రసాయనికమూలకం. ఇది ఒక లోహంకుడా. మూలకాల ఆవర్తన పట్టికలో 12 వ సముహమునకు చెందిన మొదటి మూలకం. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 30. మూలకంయొక్క సంకేత అక్షరము Zn జింకును ఇంకను యశదము, తుత్తునాగము అనియు పిలిచెదరు.

చరిత్ర

శతాబ్దంలకుముందే తుత్తునాగమును ఒకమూలకంగా గుర్తించుటకు పూర్వమే దీనియొక్కఖనిజాని ఇత్తడినితయారుచెయ్యడంలో ఉపయోగెంచెవారు. క్రీ.పూ.1400-1000 సంవత్సరాలకు చెందిన ఇత్తడినిపాలస్తీనాలో కనుగొన్నారు. ఐతిహాసికయుగమునకు చెందిన 87% జింకును కలిగిన ధాతువును ట్రాన్సిల్వానియ (Transylvania) గుర్తించారు.క్రీ.పూ.శతాబ్ది నాటికే జూదియ (judea ) లో, క్రీ.పూ .7వ శతాబ్దినాటికి పురాతన గ్రీసులో రాగి మరియు జింకు మిశ్రణం వలన రూపొందించిన ఇత్తడి అనే మిశ్రమ ధాతువు వాడేవారు. అనగా అప్పటికే జింకు లోహంతో మానవునికి పరిచయం ఉంది. క్రీ.శ. 12 వ శతాబ్ది వరకుభారతదేశంలో తక్కువ పరిమాణంలో మాత్రమే ఉత్పత్తి అయ్యెడిది. ఇక యూరోపు ఖండంలో 16 వ శతాబ్ది చివరకు జింకు గురించి తెలియదు. భారతదేశంలో,రాజస్థాన్ రాష్టంలో గుర్తించిన జింకుగనులు క్రీ.పూ. 6వ శతాబ్దికి చెందినవి. అనగా ఇక్కడి జనులకు అప్పటికే జింకు లోహం గురించిన మంచి అవగాహన ఉంది. క్రీ.శ.1347నాటికి భారతదేశంలో జింకును ప్రత్యేక లోహంగా గుర్తించారు. అప్పటికి జింకు మానవుడు గుర్తించిన 8 వలోహం.12-16వశతాబ్దివరకు జింకులోహం, మ రియు జింకె ఆక్సైడులు భారతదేశంలో ఉత్పత్తి చెయ్యబడినవి. 17 వ శతాబ్దిలో భారత్ నుండి జింకు ఉత్పత్తి విధానం చైనాకు పరిచయం చేయబడి, అక్కడ ఇత్తడి తయారు చేయుటకు అవసరమైన జింకును ఉత్పత్తి చేయు స్థాయికి అక్కడ అభివృద్ధి చెందినది ఈ నాటికి శుద్ధమైన జింకుఉత్పత్తికి చెందిన పురాతనమైన ఆనవాలు రాజస్థాన్ లోని జావార్ (jawar ).క్రీ.శ.9వ శతాబ్ది నాటి స్వేదన విధానం ద్వారా శుద్ధమైన లోహాన్ని తయారుచేసిన ఆధారాలు ఇక్కడే లభించెను. నాటి రసవాదులు జింకునుగాలిలో మండించడం వలన ‘’white snow ‘’లేదా philosopher’s wool" తయారు చేసేడి వారు. ఈ మూలకానికి జర్మనీ పదం ‘zinke’ ఆధారంగా జింకు పేరును అనే పారసెల్‌సిస్అనే రసవాది ఖాయం చేసినట్లు తెలుస్తున్నది. 1746 లో శుద్ధమైన జింకును కనుగొన్న ఖ్యాతి Andreas Sigismund Marggraf నకు దక్కినది