Sunday 2 October 2016

Chromium(24)

ప్రాథమిక సమాచారం

క్రోమియం అనునది ఒక రసాయనిక మూలకం. ఇది ఆవర్తన పట్టికలో 6 వ సముదాయం/సమూహంనకు, d బ్లాకునకు, 4 వ పీరియడ్‌కు చెందినది[2].6 సమూహం నకు చెందిన మూలకాలలో క్రోమియం మొదటి మూలకం.ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 24. క్రోమియం యొక్క రసాయన సంకేత అక్షరం Cr.క్రోమియం ఉక్కు లాంటి బూడిద రంగుతో, తళతళలాడే, మెరిసే, దృఢమైన, పెలుసైన లోహం.చాలా నునుపైన ఉపరితలం కలిగి, త్వరగా మెరుపు/ మెఱుగుతగ్గని లోహం. క్రోమియంఎక్కువ ద్రవీభవన స్థానం కలిగియున్నది. 2 వేల సంవత్సరాల క్రితమే, చైనా క్విన్ రాజవంశ పాలన సమయంలోని, టెర్రకోట విగ్రహ సైన్యం ఆయుధాలు క్రోమియం లోహపూతను కలిగి ఉండుటనుబట్టి, ఆనాటికే క్రోమియంను లోహంగా వాడేవారని తెలియు చున్నది.

చరిత్ర

క్రోమియం ఖనిజాలను రంగు పదార్థాలుగా గురించి ఉపయాగించుట పశ్చిమ దేశాలలో 18 వ శతాబ్దిలో మొదలైనది.జోహన్ గొట్టోబ్ లెహ్ మాన్ (Johann Gottlob Lehmann ) జులై 26, 1761 లో యురల్ పర్వతప్రాంతం లోని Beryozovskoye గనులలో నారింజ-ఎరుపు రంగులోని ఖనిజాన్ని గుర్తించి, దీనిని సెలీనియం లేదా ఇనుముతో కలిసి ఏర్పడిన సీసము సమ్మేళనంగా పొరపాటు పడి/భావించి సేబెరియన్ రెడ్ లెడ్ (Siberian red lead) అని నామకరణం చేసాడు.నిజానికిది సీసం కలిగిన క్రోమియం సమ్మేళనం అయిన క్రోకైట్ (crocoite) అను లెడ్ క్రోమేట్, దీని ఫార్ములా PbCrO4.

1770 లో పీటర్ సైమన్ పల్లాస్ (Peter Simon Pallas) కూడా లెహ్‌మాన్ ఖనిజాన్ని గుర్తించిన ప్రాంతానికి వచ్చి రంగుల్లో క్రోకైట్ ఖనిజాన్ని రంగుపదార్థంగా వాడుటకు అవసరమైన లక్షణాలు దండిగా ఉండటం గుర్తించారు.ఈఖనిజాన్ని రంగు పదార్థంగా వాడటం శీఘ్రగతిలో అభివృద్ధి పొందినది. క్రోకైట్ ఖనిజం నుండి తయారు చేసిన ప్రకాశవంతమైన మెరిసే పసుపు రంగు ఎక్కువ ప్రీతి పాత్రమైనది .

లూయిస్ నికోలస్ వాక్వెలిన్ (Louis Nicolas Vauquelin, 1797 లో క్రోకైట్ ఖనిజాన్ని సేకరించి, దానిని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించి క్రోమియం ట్రైఆక్సైడ్ (CrO3) ను ఉత్పత్తి చేసాడు.1798లో క్రోమియం అక్సైడును బొగ్గుపొయ్యి/బట్టి (charcoal oven) లో వేడి చెయ్యడం ద్వారా క్రోమియం లోహాన్ని వేరు చేసి, క్రోమియం మూలకాన్ని కనుగొన్న కీర్తి దక్కించుకున్నాడు.వాక్వెలిన్ ఇంకా పచ్చ, కెంపు రత్నాలలో ఉన్నక్రోమియం ఆనవాలును కూడా కనుగొన్నాడు[2].

పదోత్పత్తి

క్రోమియం మూలకానికి ఈ పేరు గ్రీకు భాష పదమైన χρῶμα, chrōma, (అర్థం వర్ణం, రంగు అని) నుండి వచ్చినది[2]. కారణం క్రోమియం యొక్క సమ్మేళనాలు బలీయమైనగాఢమైన రంగును కలిగియున్నవి.ఉచ్చారణ:KROH-mee-em.

లభ్యత

భూమి యొక్క నేలలో విస్తారంగా లభించు 22 వ మూలకం క్రోమియం.భూమి పొరలలో సుమారు 100 ppm (మిలియను భాగాలకు ఒకభాగం ) వరకు ఉంది. క్రోమియంను కలిగిన శిలలు, బండలు వాతావరణంలో కోతకుకు గురిఅయిన పరిసరాలలో, అగ్నిపర్వతాలు విస్పొటన చెందినపుడు, క్రోమియం సమ్మేళనాలు కలిగిన లావాధూళి పరి సర ప్రాంతాలలో వెదజల్లబడిన పరిసర ప్రాంతా ల్లోలలోను కనుగొనడం జరిగింది.అటువంటి నేలలో క్రోమియం గాడత 1-300 మిల్లి గ్రాము]లు/కిలో ఉండును. సముద్ర జలంలో గాడత 5-800 µg మైక్రో గ్రాములు/లీటరు. నదులు, సరస్సులలోని నీటిలో 26 మైక్రో గ్రాముల నుండి 5.2 మిల్లిగ్రాములు/లీటరుకు ఉండును.

క్రోమియం లోహం కై గనులనుండి తీయు ముడిఖనిజం క్రోమైట్ (FeCr2O4) . ప్రపంచంలో గనులనుండి తీయు క్రోమైట్‌లో అయిదు భాగాల్లో రెండు వంతులు వాటా దక్షిణాఫ్రికా దేశానిదే.ఆ తరువాత క్రమంలో కజకిస్తాన్, భారతదేశం, రష్యా, మరియు టర్కీ దేశాలు క్రోమైట్ ఖనిజాన్ని ఉత్పత్తి చేయుచున్నవి. అరుదైనప్పటికి రష్యా లోని ఉదచన్యపైప్ అనేప్రాంతమలో క్రోమియం మూలకంగా భూ నిక్షేపాలలో లభిస్తుంది. ఈ ప్రాంతంలో మూలక క్రోమియం మరియు వజ్రాలు అధికంగా లభించును.

లభించు క్రోమియంలో క్రోమియం (III) , క్రోమియం (VI) ల నిష్పత్తి, అవి లభ్యమగు పరిసరాలలోని pH విలువ మరియు ఆక్సీకరణ లక్షణాలను బట్టి మారును. కొన్ని ప్రాంతాల్లోని భూగర్బ జలంలో లీటరుకు 39 మైక్రోగ్రాముల క్రోమియం మూలకమున్నచో, అందులో 30 మైక్రోగ్రాములు క్రోమియం ఉండును.