Sunday 2 October 2016

Scandium (21)

స్కాండియం (Scandium ఒక రసాయన మూలకము. దాని సంకేత సూచకము Sc. పరమాణు సంఖ్య 21. ఇది వెండిలాగా మెరిసే ఒక లోహము. ఇది మూలక రూపంలో ప్రకృతిలో లభించదు. కాంపౌండ్‌ల రూపంలో అరుదైన ఖనిజంగా స్కాండినేవియా ప్రాంతం లోను, ఇతర స్థలాలలోను లభిస్తుంది. ఇదీ, యిట్రియం,లాంథనైడ్స్ కలిపి భూమిమీద అరుదుగా లభించే మూలకాలుగా వర్గీకరిస్తారు. (rare earth element).

మొట్టమొదట 1879లో స్కాండియం అనే మూలకాన్ని గుర్తించారు కాని తరువాత చాలా కాలం వరకు, అనగా 1937 వరకు దాన్ని ఒక లో్హంగా వేరు చేయలేకపోయారు. 1970 దశకంలో స్కాండియంను అల్యూమినియంతో కలిపి మిశ్ర లోహాలలో వాడ సాగారు. ఇదొక్కటే పారిశ్రామికంగా ప్రస్తుతం స్కాండియం వినియోగం.

1869లో మెండలీవ్ తన ఆవర్తన పట్టిక ద్వారా స్కాండియం స్థానంలో ఒక మూలకం ఉండాలని ఊహించాడు. ఈ సంగతి తెలియకుండానే 1879లోలార్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అనే శాస్త్రవేత్త అధ్వర్యంలోని బృందం యూక్సనైట్ మరియు గాడోలినైట్ఖనిజాలనుండి కనుగొన్న క్రొత్త మూలకానికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు. [3] [4] మొదటి ప్రయత్నంలో 250 మిల్లీ గ్రాముల శుద్ధ స్కాండియంను మాత్రం వేరు చేయగలిగారు. తరువాతి ప్రయత్నంలో 10 కిలోగ్రాముల యూక్సనైట్ ఖనిజంనుండి 2.0 గ్రాముల పరిశుద్ధమైనస్కాండియం ఆక్సైడ్‌ను వేరు చేయగలిగారు.(Sc2O3).[4]. 1960 నాటికి కాని 99% పరిశుద్ధమైన ఒక పౌండు స్కాండియం మెటల్‌ను వేరు చేయడం సాధ్యం కాలేదు.

స్కాండియం అరుదుగా లభించే గట్టి, గరుకైన, నల్లని లోహం. గాలి తగిలినపుడు కొంచెం పసుపు రంగుకు మారుతుంది.