Sunday 2 October 2016

Cobalt (27)

కోబాల్ట్, మూలకాల ఆవర్తన పట్టికలో 9 వ సముదాయం, d బ్లాకు, 4 వ పిరియడ్ కు చెందిన మూలకం.కోబాల్ట్ దృఢమైన, వెండి-బూడిదరంగు ల మిశ్రిత వర్ణం కలిగిన మెరిసే లోహం . కోబాల్ట్ ఒక పరివర్తక మూలకం. భూమి ఉపరితలంలో ఇది రసాయనికం సమ్మేళనం చెందిన రూపంలో లభిస్తుంది

చరిత్ర

కోబాల్ట్ ను శతాబ్దాలుగా గాజు వస్తువులకు, పింగాణి వస్తువులకు, మరియు glazesకు నీలిరంగునుకల్గించుటకై ఉపయోగించేవారు. కోబాల్ట్‌ను వాడిన ఆనవాళ్ళు క్రీ.పూ. మూడు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టియను శిల్పాలలో, పెరిషియను ఆభరణాలలోను, పొంపి (pompeii:క్రీ.శ.79 నాశనం చెయ్యబడినది) నగర శిధిలాలలో అలాగే చైనాలో టాంగ్ Tang సామ్రాజ్యం/రాజవంశం (618–907 AD) మరి the Ming రాజవంశం (1368–1644 AD) కాలంలో ఉపయోగించారని ఆధారాలు కనిపిస్తున్నాయి. కంచుయుగం నాటి నుండి రంగు గాజు వస్తువులలో వాడేవారు. 14 శతాబ్దికి చెందిన శిధిలమైన ఉలుబురున్ ఓడ శిధిలాలను వెలికి తీసినప్పుడు, అందులో నీలిరంగు గాజముద్దను గుర్తించారు

ఈజిప్టు లోని రంగు గాజు వస్తువులకు తయారు చేయుటకై రాగి, ఇనుము, మరియు కోబాల్ట్ ను ఉపయోగించేవారు. ఈజిప్టుకు చెందిన 18 వ రాజ వంశ పాలకుల కాలం (1550-1292) నాటి అతి పురాతనమైన కోబాల్ట్ ఉపయోగించిన రంగు గాజు వస్తువులను గుర్తించారు.అయితే వారికి కోబాల్ట్ సమ్మేళనాలు ఎక్కడ లభ్యమైనవన్న విషయం మాత్రం తెలియదు.

పదోత్పత్తి

మూలక పేరు కోబాల్ట్ కు మూలం జర్మనీ పదమైన kobalt, kobold అనగా దయ్యము/ పిశాచము (goblin ) [ మూడనమ్మకంతో కూడిన ఈ పేరుతో కోబాల్ట్ యొక్క ముడి ఖనిజాన్నిపిలిచేవారు.ఎందుకనగా రాగి, లేదా నికెలు లోహాలను ఉత్పత్తి చేసినట్టుగా, లోహాన్ని ఉత్పత్తి చేయుటకు మొదటి సారి ఈ ముడి ఖనిజాన్ని బట్టీ పెట్టినపుడు లోహ ఉత్పత్తి జరుగకుండా, కేవలం పొడి (కోబాల్ట్ (II) ఆక్సైడ్) ఎర్పడినది.ప్రథమంలో, ఉపయోగించు ముడి ఖనిజంఆర్సెనిక్ను మాలిన్యంగా/కల్మషంగా కలిగి యుండుట వలన, బట్టీ (smelting) సమయంలో అత్యంత విష పూరితమైన, త్వరగా ఆవిరిగా మారు ఆర్సెనిక్ ఆక్సైడ్వాయువులు వెలువడటం వలన లోహ ఉత్పత్తి అసాధ్యంగా మారినది.

ఆవిష్కరణ

స్వీడిష్ రసాయనికవేత్త జార్జి బ్రాండ్ట్ (Georg Brandt (1694–1768) , 1735 లో కోబాల్ట్‌ను కనుగొన్న కీర్తిని స్వంతం చేసుకున్నాడు ఈయన కోబాల్ట్ అప్పటి వరకు తెలియని కొత్త మూలకమని, బిస్మత్ మరియు ఇతర సంప్రదాయక లోహాలకన్న భిన్నమైనదని నిరూపించాడు. అంతవరకు భావిస్తున్నట్లుగా గాజు వస్తువులకు నీలిరంగు రావటానికి కారణం బిస్మత్కాదని, కోబాల్ట్ సమ్మేళనాలు కారణమని నిరూపించాడు. చరిత్రకు ముందు యుగం తరువాత, చారిత్రాత్మకంగా కనుగొన్న మొదటి లోహం కోబాల్ట్. ఎందుకనగా అంతముందు మానవునిచే కనుగొనబడి, వాడుకలో ఉన్న ఇనుము, రాగి, వెండి, బంగారం, జింకు, పాదరసం,తగరం, సీసం, మరియు బిస్మత్ మూలకాల ఆవిష్కరణకు సంబంధించిన కచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు.