Wednesday 26 October 2016

Palladium (46)

పెల్లేడియం, ప్లేటినం, రోడియం, రుథీనియం, ఇరిడియం, ఆస్మియం - ఈ ఆరు రసాయన మూలకాలని ప్లేటినం గ్రూపు లోహాలు అంటారు. వీటి లక్షణాలలో గట్టి పోలికలు ఉన్నాయి; పెల్లేడియం వీటన్నిటిలో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర కరుగుతుంది, అన్నిటి కంటే తక్కువ సాంద్రత కలది. పెల్లేడియం రసాయన హ్రస్వనామం Pd, అణు సంఖ్య 46. అరుదుగా లభించే, వెండిని పోలిన ఈ మూలకం ఉనికిని 1803లో విలియం హైడ్‌ ఒలాస్టన్‌ (William Hyde Wollaston) కనుక్కున్నారు. ఆ రోజుల్లోనే ఆవిష్కరణ పొందిన నభోమూర్తి పేలస్ (Pallas) గ్రహం అనుకుని ఆ గ్రహం గౌరవార్థం ఈ మూలకానికి పెల్లేడియం అని పేరు పెట్టడం జరిగింది. దరిమిలా పేలస్‌ గ్రహం కాదనీ, కేవలం గ్రహశకలం(planetoid or asteroid) అనీ తెలిసింది కాని అప్పటికే పెల్లేడియం పేరు స్థిరపడిపోయింది.

పెల్లేడియం, దాని సహజాతి మూలకం అయిన ప్లేటినం, ఎక్కువగా కారుల నుండి బయటకి వచ్చే అపాన వాయువులని (అనగా, ఉదకర్బనాలు, కార్బన్ మోనాక్సైడ్‌, నైట్రొజన్‌ డైఆక్సైడ్‌) శుద్ధి చెయ్యడానికి వాడతారు. ఈ రెండు మూలకాల ఉత్పత్తిలో దరిదాపు 90 శాతం కెటాలిటిక్ కన్‌వర్టర్లు తయారీలోనే ఖర్చు అయిపోతుంది. పెల్లేడియంని వైద్యుత పరికరాల ఉత్పత్తిలోను, దంతవైద్యం లోనూ, ఉదజని వాయువుని శుద్ధి చెయ్యడానికి, భూజలాన్ని శుద్ధి చెయ్యడానికి, నగల తయారీలోను కూడా వాడతారు. పెల్లేడియంని ఇంధన ఘటాల (fuel cells) తయారీలో కూడా వాడతారు. ఇంధన ఘటాలు ఉదజనిని, ఆమ్లజనిని సంయోగపరచి విద్యుత్తుని, వేడిని పుట్టించి, నీటిని విడుదల చేస్తాయి.

ఈ జాతి ఖనిజాలు అరుదుగా దొరుకుతున్నాయి. దక్షిణ ఆఫ్రికా లోని ట్రాస్వాల్‌ రాష్ట్రంలోను, అమెరికాలో మొన్‌టానా రాష్ట్రంలోను, కెనడాలోని అంటారియో రాష్ట్రంలోను, రష్యాలోను కొన్ని భూగర్భ నిధులు ఉన్నాయి.

Rhodium (45)

రోడియం కూడ రుథీనియం లాంటి రసాయన మూలకమే. దీని రసాయన హ్రస్వనామం Rh. దీని అణు సంఖ్య 45; అనగా దీని అణు కేంద్రకంలో 45 ప్రోటానులు ఉంటాయి. ఇది ఆవర్తన పట్టికలో 9వ నిలువు వరుస (గ్రూప్‌) లో కనిపిస్తుంది. రోడియం కి ఉన్న ఒకే ఒకసమస్థాని (isotope) ఉంది: 103Rh. విలియం ఓల్స్‌టన్‌ (en:William Hyde Wollaston) ఈ మూలకాన్ని 1804 లో కనుక్కున్నారు.

గ్రీకు భాషలో రోడియం అంటే ఎరుపు లేదా గులాబి రంగు అనే అర్థం ఉంది. రోడియం లవజనులతో కలవగా వచ్చిన లవణాలు ఇలాంటి ఎరుపు రంగులో ఉంటాయి కనుక ఈ పేరు వచ్చింది కాని, రోడియం చూడడానికి వెండిలా ఉంటుంది. ఈ మూలకం పెల్లేడియం దొరికే ఖనిజపు రాళ్లల్లోనే, కల్తీ సరుకులా, స్వల్పమైన పాళ్లల్లో దొరుకుతుంది. సాలీనా దీని ఉత్పాదన 20 టన్నులకి మించదు. ఇది అపురూపమైన (precious) లోహాలన్నిటిలోకి ఎక్కువ విలువైనది. అంతే కాకుండా ఈ లోహం ఉదాత్తమైన (noble) లోహం; అనగా, తుప్పు పట్టదు, గాఢ ఆమ్లాలలో కరగదు.

ఉపయోగాలు

1) కొన్ని రకాల రసాయన సంయోగాలని త్వరితపరచడానికి దీనిని ఉత్ప్రేరకి catalyst గా ఉపయోగిస్తారు.                         2) కారులు విసర్జించే అపాన వాయువులలో ఉన్న కల్మషాలని కడిగి శుభ్రం చెయ్యడానికి వాడే "కెటాలిటిక్‌ కన్వర్టర్‌" లలో దీనిని ఎక్కువ వాడుతున్నారు.             3) పలచటి రేకులా చేసి ఎక్సు-కిరణాలని గలనం చెయ్యడానికి రోడియంని ఉపయోగిస్తారు.        4) గుండె సరిగ్గా కొట్టుకోకపోతే హృదయ స్పందనని క్రమబద్ధం చెయ్యడానికి వాడే "పేస్ మేకర్" లలో వాడే సన్నని తీగని చెయ్యడానికి కూడ రోడియంని ఉపయోగిస్తారు.                          5) కొన్ని లోహా.లు తుప్పు పట్టకుండా ఉండడానికి పైపూతగా వాడే మలామాని తయారు చెయ్యడానికి కూడ రోడియంని వాడతారు.                                 6) అణుశక్తి ఉత్పాదక కేంద్రాలలో నూట్రాన్ అభిప్రవాహాల (flux) మట్టాన్ని పసికట్టడానికి వాడే పత్తాసుల (detectors) నిర్మాణంలో కూడ దీనికి ఉపయోగం ఉంది.

Monday 24 October 2016

Ruthenium (44)

రుథీనియం ఒక రసాయన మూలకం. దీని రసాయన హ్రస్వనామం Ru. దీని అణు సంఖ్య 44; అనగా దీని అణు కేంద్రకంలో 44 ప్రోటానులు ఉంటాయి. ఇదిఆవర్తన పట్టికలో ప్లేటినం ఉన్న నిలువు వరుస (గ్రూప్‌) లో కనిపిస్తుంది. కార్ల్ క్లౌస్ అనే జెర్మనీ దేశపు శాస్త్రవేత్త ఇది మూలకమే అని 1844 లో నిర్ధారించి ఈ పేరు పెట్టేరు. లేటిన్‌ భాషలో రుథీనియం అంటే రష్యా అనే అర్థం ఉంది. ఈ మూలకం ప్లేటినం దొరికే ఖనిజపు రాళ్లల్లోనే స్వల్పమైన పాళ్లల్లో దొరుకుతుంది. సాలీనా దీని ఉత్పాదన 20 టన్నులకి మించదు [3].

రుథీనియం చూడడానికి వెండిలా ఉంటుంది. మెత్తగా గుండ చేస్తే నల్లగా ఉంటుంది. ప్లేటినం లాగే ఇది కూడా మిగిలిన మూలకాలతో రసాయన సంయోగం చెందడానికి ఇష్టపడదు. ఉదహరికామ్లం లోను, గంధకికామ్లం లోనూ, నత్రికామ్లం లోనూ వేసినా కరగదు. విద్యుత్ పరికరాల్లో ఒరపిడికి ఓర్చుకోగలిగే లోహపు సన్నికర్షాల (contacts) నిర్మాణంలో ఈ లోహాన్ని ఉపయోగిస్తారు. కొన్ని రకాల రసాయన సంయోగాలని త్వరితపరచడానికి దీనిని ఉత్ప్రేరకి catalyst గా ఉపయోగిస్తారు. ఈ రకం ఉత్ప్రేరకాలతో ఒక కొత్త రకం రసాయన సంయోగాలకి అవకాశం కలిగింది కనుక రుథీనియం విలువ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. చిన్న ఉదాహరణగా - ఈ రకం సంయోగాల వల్ల రకరకాల సువాసలు వెదజల్లే పంచరంగుల కొవ్వొత్తులు తయారు చెయ్యడానికి వీలు పడింది. ఈ రకం సంయోగాలకి నాంది పలికినందుకుగాను రాబర్ట్‌ గ్రబ్స్ కి నోబెల్‌ బహుమానం వచ్చింది.

Sunday 23 October 2016

Molybdenum (42)

Technitim(43)

టెక్నీషియమ్ (Technitium) ఒకరకమైన రేడియోధార్మిక మూలకము. దీని పరమాణు సంఖ్య 43 మరియు సంకేతము Tc. ఇది వెండిలాగా మెరిసేపరివర్తన మూలకము. దీని రేడియోధార్మిక ఐసోటోపు (టెక్నీషియమ్-99m) న్యూక్లియర్ వైద్యంలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించడంలో చాలా ఉపయోగపడుతుంది.

Friday 21 October 2016

Itrium (39)

Zirconium (39)

                                                                                                                                      మౌలిక సమాచారం
జిర్కోనియం (Zirconium) అనునది ఒక రసాయనిక మూలకము .మూలకాలఆవర్తన పట్టికలో 4 వ సముదాయం, d బ్లాకు,5 వ పిరియడ్కు చెందినలోహం. దీనియోక్కపరమాణు సంఖ్య 40. ఈ మూలకం యొక్క సంకేత అక్షరం Zr. ఇది బూడిద–తెలుపు రంగులో ఉంటుంది. జిర్కోనియాన్ని ప్రముఖంగా దుర్గలనీయలోహం/ఉష్ణనిరోధకి (refractory) మరియు కాంతిరోధకి (opacifier, గా వాడెదరు. దీనిని లోహాలలో లోహాల దృడత్వం పెంచటానికి, లోహల క్షయికరణను నిరోదించుటకై మిశ్రమ ధాతువుగా తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు.
చరిత్ర
జిర్కోనియం యొక్క ఖనిజమైన జిర్కోన్ మరియు ఇతర ముడిఖనిజాల (జార్గున్, హియసిమ్త్, జాసిమ్త్, లిగుర్ ) గురించి బిబిలికల్వ్రాతలలో/ లిఖితాలలో వివరించారు.1789 లో శ్రీలంక నుండి సేకరించిన జార్గూన్ (jargoon) పదార్థాన్ని మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోట్ ( Klaproth) విశ్లేషణ /పరీక్ష చేసేవరకు ఇది ఒక విడి మూలకమని ఎవ్వరికి తెలియదు[4].ఆయన దీనికి జిర్కొనేర్డ్ (Zirkonerde) (జిర్కొనియ:zirconia) అని నామకరణ చేసాడు. 1808 లో హంప్రీ డేవి విద్యుద్వివిశ్లేషణ ద్వారా ఈమూలకాన్ని వేరుచెయ్యుటకు ప్రయత్నించినను సఫలికృతుడు కాలేకపోయాడు.1824 లో స్వీడిస్ రసాయనవేత్త, బెర్జిలియస్ (Berzelius) అను శాస్త్రవేత్త పొటాషియం, పొటాషియం జిర్కోనియం ఫ్లోరైడ్ మిశ్రమాన్ని ఒక ఇనుపగొట్టంలో తీసుకోని వేడి చెయ్యడం ద్వారా మొదటగా జిర్కోనియం మూలకంనుగా వేరుచేసాడు].
తరువాత క్రమంలో వ్యాపారాత్మక స్థాయిలో క్రిస్టల్ బార్ ప్రాసెస్ (ఐయోడైడ్ ప్రాసెస్) అను విధానంద్వారా జిర్కొనియాన్ని ఉత్పత్తి చెయ్యడాన్ని ఎంటోన్ ఎడ్వర్డ్ వాన్ అర్కెల్ జన్ (Anton Eduard van Arkel Jan) మరియు హెండ్రిక్ డి బోయర్ (Hendrik de Boer) లు,1925 లో కనుగొన్నారు.ఈ పద్ధతిలో మొదట జిర్కోనియం టెట్రా ఐయోడైడ్ ను ఏర్పరచి, తరువాత దీనిని ఉభయ వియోగం చెందించడం ద్వారా జిర్కొనియాన్ని ఉత్పత్తి చేసెడి వారు.
1945 లో క్రోల్ ప్రాసెస్ అనే జిర్కోనియం ఉత్పత్తి చేసే క్రొత్త విధానాన్ని విలియం జస్టిన్ క్రోల్ (William Justin Kroll) కనుగొనెను.ఈ పద్ధతిలో జిర్కోనియం టెట్రాక్లోరైడును మాగ్నీషియంతో క్షయికరించడం ద్వారా జిర్కోనియం లోహాన్ని ఉత్పత్తి చెయ్యడం జరిగింది.
ZrCl4 + 2Mg → Zr + 2 MgCl2
పద ఉత్పత్తి
జిర్కోనియం పదంలోని zircon, పెర్షియన్ పదం zargun (زرگون) నుండి వచ్చినది, దాని అర్థం బంగారు రంగు.
మూలక ధర్మాలు
జిర్కోనియం సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉండు లోహం. ఇది ఒక బలమైన పరివర్తన లోహం.జిర్కోనియం లోహ, అలోహాలతో కలసి జిర్కోనియం డయాక్సైడ్, జిర్కొనోసేన్ డై క్లోరైడ్ వంటి సమ్మేళనాలను ఏర్పరచ గలదు. అయితే కల్తి లోహం గట్టిగా పెలుసుగా ఉండును. పుడి (powder) గా ఉన్నప్పుడు త్వరగా మండే స్వభావమున్న మూలకం జిర్కోనియం. ఘనాకృతి రూపంలో ఉన్నచో దహనం చెందదు/మండదు. క్షారాల, ఆమ్లాల, మరియు లవణద్రావణాల నుండి క్షయికరణనను బాగా తట్టుకుంటుంది . హైడ్రోక్లోరిక్, మరియు సల్ప్యూరిక్ ఆమ్లాలలో కరుగుతుంది. ముఖ్యంగా ప్లోరిన్ సమక్షములో. శుద్ధమైన జిర్కోనియం రేకులుగా తీగె లుగా సాగేగుణం కలిగిన లోహం.
జిర్కోనియం యొక్క ద్రవీభవన స్థానం: 1855 °C (3371 °F, మరుగు స్థానం: 4371 °C (7900 °F).జిర్కోనియంయొక్క ఎలక్ట్రో నెగటివ్ విలువ:1.33పౌల్స్ . జిర్కోనియం యొక్క విశిష్ణ గురుత్వం:6.506 (20 °C), వెలన్సి విలువలు:+2, +3, మరియు +4;ద్రవీభవన ఉష్ణోగ్రత:1852 ± 2 °C, మరియు భాష్ఫీభవన స్థానం:4377 °C;
లభ్యత
జిర్కోనియం భూఉపరితలంలో 130 మీ.గ్రాములు/కిలో వరకు లభ్యమగును. సముద్రజలంలో 0.026 μg/లీటరు వరకు లభించును. ఇది నేరుగా లోహరూపంలో లభించదు.జిర్కోనియాన్ని ఎక్కువ కలిగిన ఖనిజం జిర్కోన్ (ZrSiO4).జిర్కోను ఖనిజం ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా, మరియు సంయుక్తరాష్టాలలో ఎక్కువ ప్రమాణంలో లభించును. అంతియే కాకుండా ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో కూడా తక్కువ పరిమాణంలో జిర్కోనియం ఖనిజం లభించును. ఉత్పత్తి అగుచున్న జిర్కోన్ ఖనిజంలో 80% ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో అగుచున్నది. ప్రపంచ వ్యాప్తంగా జిర్కోన్ ఖనిజనిల్వ 60 మిలియను టన్నులు ఉన్నట్లుగా అంచనా.ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 0.9మిలియను టన్నుల జిర్కోనియం ఉత్పత్తి అగుచున్నది. జిర్కోన్ ఖనిజంలో మాత్రమే కాకుండగా, ఇంకా 140 ఇతర ఖనిజాలలో కూడా జిర్కోనియం లోహం ఉంది. జిర్కోనియాన్ని తగిన పరిమాణంలో baddeleyite మరియు kosnarite ముడి ఖనిజాలు కలిగి యున్నవి.
విశ్వంలో విస్తృతంగా S–రకానికి చెందిన నక్షత్రాలలో లభించును. ఈ మూలకాన్ని సూర్యుమండలంలో, మరియు ఉల్కలలో కుడా గుర్తించారు.చంద్రమండలం నుండి తెచ్చిన శిలలలో జిర్కోనియం ఆక్సైడ్ ఎక్కువ ప్రమాణంలో గుర్తించారు.
ఉత్పత్తి
ప్రపంచ వ్యాప్తంగా జిర్కోన్ ఖనిజనిల్వ 60 మిలియను టన్నులు ఉన్నట్లుగా అంచనా.ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 0.9మిలియను టన్నుల జిర్కోనియం ఉత్పత్తి అగుచున్నది.జిర్కోన్ ఖనిజాన్ని అధికభాగం వ్యాపార వినియోగానికి నేరుగా ఉపయోగిస్తారు. మిగిలిన ఖనిజం నుండి జిర్కోనియం లోహాన్ని ఉత్పత్తి చెయ్యుదురు. క్రోల్ ప్రాసెస్ పద్ధతిలో జిర్కోనియం క్లోరైడ్ను మాగ్నీషియంతో కలిపి క్షయికరణ చేసి జిర్కోనియం లోహాన్ని ఉత్పత్తి చెయ్యుదురు.వ్యాపారాత్మక ముగా భారీ స్థాయిలో ఉత్పత్తి చెయ్యు జిర్కోనియంలో 1-3% హఫ్నియం (hafnium) లోహం కల్మషంగా ఉండును.ఇలాఏర్పడిన లోహాన్ని సాగే గుణం వచ్చే వరకు వేడిచేయుదురు (sintering).
ఉపయోగాలు
జిర్కోనియం లోహం న్యూట్రానుల శోషించదు.అందువలన దీనిని పరమాణు విద్యుత్కేంద్రాలలో ఉపయోగించెదరు.ఉత్పత్తి అగుచున్న జిర్కోనియంలో90%ను పరమాణు కేంద్రాలలో ఉపయోగిస్తున్నారు.పరమాణు కెంద్రాలలోజి అభిక్రియకము (reactor) లలో100,000 మీటర్ల పొడవు జిర్కోనియం మిశ్రధాతువు గొట్టాలుండును. నియోబియంతో కలసి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా సూపరువాహకగుణాన్ని ప్రదర్శించును.అందుచే ఈరెండింటిని సూపరు కండక్టివ్ అయస్కాంతాలలో ఉపయోగిస్తారు[5].
లోహములను కరగించు, వేడిచేయు కొలిమి/బట్టీల (furnace) ఇటుకలు, రాగిగొట్టాలు (Percussion caps, ఉత్ప్రేరక పరివర్తకం (catalystic converter) లుతయారిలో ఉపయోగిస్తారు.దూరదర్శినిలలో, శస్త్రచిక్సిత పరికారాలతయారి, ఫోటోగ్రఫిలో వాడు ఫ్లాష్బల్బులలో జిర్కోనియాన్ని ఉపయోగిస్తునారు

Nebioum (40)

నియోబియం 41వ మూలకం. ఇది ఇంతకు ముందు కొలంబియం (Cb) గా ప్రస్తుతం నియోబియం (Nb) గా గుర్తింపబడుతుంది. ఇది మృదువుగా, బూడిద రంగులో, తీగలుగా సాగుగల గుణమున్న లోహము. ఇది పైరోక్లోర్ అనే ఖనిజంలో లభిస్తుంది. పైరోక్లోర్ ఖనిజం నుండి నియోబియం మరియు కొలంబైట్ లాంటి వాణిజ్యపరమయిన ధాతువులను తీయవచ్చు. గ్రీకు పురాణాల్లోని టాంటలస్ కూతురయిన నియోబ్ నుండి ఈ పేరును గ్రహించడం జరిగింది. నియోబియం ఎన్నోభౌతిక మరియు రాసాయనిక విషయాల్లో టాంటలం అనే మరో మూలకంతో చాలా సారూప్యత కలిగి ఉండటం వలన ఈ రెండిటినీ పక్కన పక్కన పెట్టి భేదాలు చూడటం కష్టం. 1801 లో చార్లెస్ హాట్చెట్ అనే ఆంగ్లరసాయనశాస్త్రజ్ఞుడు టాంటలంతో సారూప్యత కలిగిన ఒక మూలకాన్ని కనుగొని, దానికి కొలంబియం అని నామకరణం చేసాడు. 1809లో మరో ఆంగ్లరసశాస్త్రవేత్త విలియం హైడ్ వొలాస్టన్ టాంటలం మరియు కొలంబియం ఒకటే అని తప్పుడు అభిప్రాయానికి వచ్చాడు. 1846లో జెర్మన్ రసాయన శాస్త్రవేత్త హెయిన్రిచ్ రోజ్ టాంటలం ముడిలోహాల్లోరెండవ మూలకం ఉందనీ, అది నియోబియం అని నామకరణం చేసాడు. 1864 మరియు 1865 లో కొన్ని వరుసగా జరిగిన పరిశోధనల్లో తేలిందేమిటంటే నియోబియం మరియు కొలంబియం ఒకటే అనీ (టాంటలం కాకుండా), దాదాపు ఒక శతాబ్దం పాటూ రెండు పేర్లూ మార్చి మార్చి వాడబడ్డాయి. 1949లో అధికారికంగా నియోబియం అనే పేరు ధృవపడినప్పటికీ,అమెరికాలోని మెటలర్జీ (లోహశాస్త్ర) విభాగం వారు కొలంబియం అనే వాడుతున్నారు. ఇరవయ్యో శతాబ్ది మొదటికిగానీ వాణిజ్యపరంగా నియోబియం వాడుకలోకి రాలేదు. బ్రెజిల్ నియోబియం మరియు ఫెర్రోనియోబియం (అనబడే నియోబియం మరియు ఇనుము యొక్క లోహమిశ్రం) ఖనిజాల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. గ్యాస్ పైప్లైన్లలో వాడే స్టీల్లోనియోబియాన్ని వాడతారు. అధిక ఉష్ణోగ్రతల్లో నిలదొక్కుకోవడం వలన జెట్ మరియు రాకెట్ ఇంజన్లలోనియోబియాన్ని వాడతారు. ఎంఆర్ఐ స్కానర్లలోనియోబియంతో పాటు టిటానియం మరియు టిన్కలిగిన మిశ్రలోహాన్ని వాడతారు. ఇంకా వెల్డింగ్,న్యూక్లియర్ పరిశ్రమల్లో, ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్,న్యూమిస్మాటిక్స్ (నాణేలు), మరియు ఆభరణాల పరిశ్రమలలో నియోబియం వాడబడుతుంది. తక్కువ విషపూరితంగా ఉండటం మరియు ఆనోడైజేషన్ పిదప రంగు మారే అవకాశం ఉండటం వలన ఆఖరి రెండు ఉపయోగాల్లో ఎక్కువగా వాడబడుతుంది.

Sunday 16 October 2016

Strontium (38)

స్ట్రాన్షియం ఒక రసాయన మూలకము. దీని సంకేతంSr. పరమాణు సంఖ్య 38. ఇది ఒక ఆల్కలీన్ ఎర్త్ మెటల్ (alkaline earth metal). మెత్తని, మెరిసే తెలుపురంగులో లేదా కొద్ది పసుపు చాయలో ఉండేలోహము. ఇది అత్యధిక రసాయన సంయోజన గుణంకలిగి ఉంటుంది. (highly reactive chemically). గాలి తగిలినపుడు ఇది పసుపు రంగులోకి మారుతుంది. . ప్రకృతిలో ఇది సెలిస్టీన్ (celestine) మరియుస్ట్రాన్షియనైట్ strontianite అనే ఖనిజాలలో లభిస్తుంది. 90Sr అనే ఐసోటోప్ రేడియో యాక్టివ్falloutలో ఉంటుంది. దీని అర్ధ జీవిత కాలం 29.10 సంవత్సరాలు. స్కాట్లాండ్‌లోని స్ట్రాన్షియన్ అనే గ్రామంసమీపంలో ఇది కనుగొన్నందున దీనికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు.

స్ట్రాన్షియం 90%-అల్యూమినియం 10% మిశ్రలోహంగాఅల్యూమినియం-సిలికాన్ కాస్టింగులలో స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది.  రంగుల టెలివిజన్ క్యాథోడ్ కిరణ ట్యూబ్‌లకు వాడే గాజు పదార్ధాలలో X-కిరణాలునివారించడానికి స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది. 

Saturday 15 October 2016

నాణేలు సరైనవో, నకిలీవో ఎలా తెలుస్తుంది? 


ప్రశ్న: నాణేలు సరైనవో, నకిలీవో ఎలా తెలుస్తుంది? 
 
జవాబు: నాణేలు సరైనవో, నకిలీవో తెలుసుకోడానికి 'కాయిన్‌ టెస్టర్‌' అనే యంత్రాన్ని వాడతారు. ఇందులో ఉండే అయస్కాంత ధ్రువాల మధ్య నుంచి నాణేలు ప్రయాణించే ఏర్పాటు ఉంటుంది. ఆ ధ్రువాల మధ్య ఉండే అయస్కాంత క్షేత్రాన్ని, అయస్కాంత బలరేఖలను నాణేలు ఖండించడం వల్ల వాటిలో ఆవర్తన విద్యుత్‌ ప్రవాహాలు (Eddy currents) ఉత్పన్నమవుతాయి. వీటి కారణంగా నాణేల వేగం మారుతుంది. అలాగే నాణేలు కాంతి శక్తిని ఉద్ఘారించే డయోడ్ల (LED) గుండా కూడా ప్రయాణిస్తాయి. అక్కడ ఉండే కాంతి గ్రాహకాలు (light sensors) ఆ నాణేల వేగం, వ్యాసాలను కొలుస్తాయి. సరైన నాణేల వేగం, వ్యాసాల విలువలు ముందుగానే ఆ యంత్రంలో నిక్షిప్తమై ఉంటాయి. నాణేలు నకిలీవైతే ఏర్పడే సున్నితమైన మార్పులను యంత్రం గుర్తించగలుగుతుంది. నకిలీ నాణేలు అదే యంత్రంలో వేరే అరలోకి చేరే ఏర్పాటు ఉంటుంది. 

www.bhaskerdesh.in

Friday 14 October 2016

Rubidium (37)

మౌలిక పరిచయం

            జర్మనీకి చెందిన రాబర్ట్ బున్సెన్ మరియు గుస్తవ్ కిర్చోప్‌లు 1861 సంవత్సరంలో, అప్పటికి నూతనంగా కనిపెట్టిన ప్లెమ్‌ స్పేక్ట్రోస్కోప్ విధానం ద్వారా "లేపిడోలైట్" అను ఖనిజంలో రుబీడియంను కనుగొనడం జరిగినది. ఈ మూలకంనకు ఆ పేరుRubidus నుండి వచ్చినది, దాని అర్థం గాఢమైన ఎరుపు

లభ్యత

భూమి పొరలలో విసృతంగా లభించే 16 వ మూలకము ఇది. జింకుతో సమాన పరిమాణంలో విసృతంగా లభించే లోహం రుబీడియం, ఒకవిధంగా రాగికన్న ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది.ఇది స్వాభావికంగా leucite, pollucite, carnallite, and zinnwaldite ఖనిజాలలో 1% వరకు లభిస్తున్నది.Lepidolite లో రుబీడియం .3% నుండి 1.5%వరకు లభించును. కొన్ని పొటాషియం ఖనిజాలు, పొటాషియం క్లోరైడ్ లు రుబీడియంను కలిగిఉన్నాయి. సాగరజలాల్లో లభించు సరాసరి ప్రమాణం 125 µg/లీ., పొటాషియం 408మి.గ్రాం/లీ కాగా సీసియం 0.3 µg/లీ ప్రమాణంలో లభిస్తుంది.

ఖనిజం నిల్వలు బెర్నిక్ లేక్ , మాంటిటొబా, మరియుకెనడా లలో, అలాగే రుబిక్లైన్((Rb,K)AlSi3O8) అను ఖనిజనిల్వలు , పోల్లుసైట్ ఖనిజ మాలిన్యాలుగా ఇటాలియన్ యొక్క ఎల్బా దీవిలో కలవు

విశ్వంలో1×10-6%,సూర్యునిలో3×10-6%,ఉల్కలలో 0.00032% ,భూమిలో0.006% ,సముద్రంలో 0.000012% ,మానవునిదేహంలో 0.00046%(మనిషిబరువులో)రుబీడియం కలదు

ఉత్పత్తి

రుబీడియంను ముడిఖనిజంనుండి విద్యుద్విచ్ఛేదనము పద్ధతిలోను లేదా కరిగించిన రుబీడియం క్లోరైడును రసాయనిక క్షయికరణం/ఆమ్లజనీహరణము చెయ్యడం వలన ఉత్పత్తి చేయుదురు

ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదెలా సాధ్యం?

*ప్రశ్న: ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదెలా సాధ్యం?*

జవాబు: ఏ పండుకైనా గింజకానీ, విత్తనం కానీ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ శాస్త్ర పరిశోధనలు పురోగమించే కొలదీ గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లు మనకు లభిస్తున్నాయి. మామూలుగా విత్తనాలను నేలలో పాతడం ద్వారా మనకు మొక్కలు ఎదుగుతాయి. కానీ కొత్త పద్ధతుల్లో తీగలు లేక చెట్ల కొమ్మలనే నేలలో పాతడం ద్వారా మొక్కలను పెంచుతున్నారు. ఈ ప్రక్రియను 'క్లోనింగ్‌' అంటారు. ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్‌ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్‌, చెర్రీలాంటి పండ్లు లభిస్తాయి.

ప్రకృతి సిద్ధమైన తీగ లేక చెట్ల నుంచి ఒక చిన్న తీగనో, కొమ్మనో తుంచి దానిని ఆ చెట్ల వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచి తడి మట్టిలో ఉంచి పెంచుతారు. కొంతకాలం తర్వాత ఆ కొమ్మకు భూమిలో వేర్లు, భూమిపైన ఆకులు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కల ఫలాలే 'సీడ్‌లెస్‌' (గింజలు లేని) పండ్లన్నమాట.

నిజానికి ఈ విధానంలో ఉత్పత్తి అయ్యే పండ్లలో కూడా ఒక దశలో గింజలు ఏర్పడుతాయి. కానీ క్లోనింగ్‌ వల్ల కలిగే జన్యుపరమైన తేడా వల్ల ఆ గింజల చుట్టూ గట్టిగా ఉండే కవచం ఏర్పడక పోవడంతో అవి అసలు గింజలలాగా గట్టిగా ఉండకుండా పండులోని గుజ్జుతో కలిసిపోతాయి.

www.bhaskerdesh.in

Thursday 13 October 2016

Germenium(32)

Gallium (31)

Bromine(35)

Selenium (34)


సెలీనియం (Selenium) ఒక రసాయన మూలకము. దీని పరమాణు సంఖ్య 34, రసాయన సంకేతము Se, పరమాణు భారము 78.96. ఇది ఒక nonmetal. దీని రసాయన గుణాలు సల్ఫర్ మరియు టెల్లూరియంలకుదగ్గరగా ఉంటాయి. ఇది ప్రకృతిలో మూలకం రూపంలో ఉండడం చాలా అరుదు.

ఎక్కువ పరిమాణంలో ఇది విషకరం. (toxic in large amounts). కాని చాలా కొద్ది మోతాదులలో మాత్రం అనేక ప్రాణుల జీవకణాల ప్రక్రియలకు అవసరం.గ్లూటాతియోన్ పెరాక్సిడేస్ మరియు తియోరిడాక్సిన్ రిడక్టేస్ అనే ఎంజైములలో కీలకమైన పదార్ధము (active center). ఈ ఎంజైములు కొన్ని జంతువులలోను, చెట్లలోను పరోక్షంగా ఆక్సిడైడ్ అయిన ఆణువులను reduce చేయడానికి సహకరిస్తాయి. ఇంకా మూడు డి-అయొడినేస్ ఎంజైములలో కూడా ఇది భాగం. ఈ మూడు డి-అయొడినేస్ ఎంజైములుథైరాయిడ్ హార్మోనుల (thyroid hormone)ను మార్చడానికి ఉపయోగ పడతాయి. కొన్ని వృక్షజాతులలో మాత్రమే సెలీనియం పదార్ధాల అవసరం ఉన్నట్లున్నది.

విడిగా సెలీనియం వివిధ రూపాలలో ఉంటుంది. సాధారణమైనది dense purplish-gray semi-metal (సెమి కండక్టర్). దీని నిర్మాణం ఒక trigonal polymer chain. ఇది చీకటిలో కంటే వెలుతురులో విద్యుత్తునుబాగా ప్రసరింపజేస్తుంది. కనుక ఫొటో సెల్స్లో దీనిని వాడుతారు.

సెలీనియం సాధారణంగా పైరైట్ వంటి సల్ఫైడ్ఖనిజాలలో లభిస్తుంది.

Arsenic (33)


ఆర్సెనిక్ అనునది ఒక రసాయనిక మూలకం..ఆవర్తన పట్టికలో ఇది 15 వ సమూహం, p బ్ల్లాకు, 4 వ పెరియాడ్‌కు చెందినది. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 33.మూలకంయొక్క రసాయనిక సంకేత అక్షరం As. ఈ మూలకం పలు ముడిఖనిజాలలలో, సాధారణంగాసల్ఫరు, మరియు ఇతర లోహాల ఖనిజాలతో కలిసి లభిస్తుంది . కొన్ని సందర్భాలలో శుద్ధమై మూలక స్పటికంగా కుడా లభ్యం. ఆర్సెనిక్ ఒక ఉపధాతువు (metalloid) . ఇది పలు రూపాంతరములు (allotropes) గా కుడా ఉంటుంది.ఇందులో బూడిద రంగుది పారిశ్రామికంగా ఉపయోగకరమైనది.

చరిత్ర

పురాతన కాలం నుండే ఆర్సెనిక్ సల్పైడులు (ఆర్పిమెంట్:orpiment, రిఅల్గర్:realgar) మరియు ఆక్సైడులు మానవ వినియోగంలో ఉన్నట్లుగా తెలియ వచ్చుచున్నది. జోసిమోస్ (సిర్కా 300 క్రీ.శ.) sandarach (realgar) నుండి ఆర్సెనిక్ అక్సైడును, దానినుండి ఆర్సెనిక్‌ను ఉత్పత్తి చెయ్యు పద్ధతిని వివరించాడు. ఆకాలంలో ఆర్సెనిక్ ను ప్రత్యర్థులను చంపుటకువిరివిగా వాడేవారు.ముఖ్యంగా పాలనలో ఉన్న వ్యక్తులను చంపుటకు వాడటం వలన దీనికి రాజుల విషం (poison of kings), విషరాజం (king of poisons) అని పిలేవారు. కంచుయుగంలో ఆర్సెనిక్‌ని కంచుకు దృఢత్వంకై, లోహతయారి సమయంలో కలిపేవారు.

• 1760 లో లూయిస్క్లాడ్ కాడేట్ డి గస్సికోర్ట్ (Louis Claude Cadet de Gassicourt) అను శాస్త్రవేత్త పొటాషియం అసిటేట్‌ను ఆర్సెనిక్ ట్రైఆక్సైడుతో చర్య జరిపించి కాడేట్ ఫ్యుమింగ్ లిక్విడ్ (Cadet's fuming liquid) అనుకార్బనిక లోహసమ్మేళనపదార్థాన్నిసృష్టించాడు.

ఆవిష్కారం

క్రీ.పూ.4 శతాబ్దిలో గ్రీకు తత్వవేత్త ఆరిస్టాటిల్ దీనిని సాండరాక్ (sandarach) అనినామకరణం చేసాడు. తదుపరి కాలంలో అతని శిష్యుడు థియోప్రశ్టాస్ (Theophrastus) దీనిని అర్హెనికం (arhenicum) అని నామకరణం చేసాడు. క్రీ.శ. 5 వ శతాబ్దిలో గ్రీకు చరిత్రకారుడు ఒలంపియోడొరస్, అర్సెనిక్ సల్ఫైడ్ను కాల్చి తెల్ల అర్సెనిక్‌ను తయారు చేసాడు (As2O3) 

క్రీ.శ.1250 లో అల్బెర్తుస్ మగ్నుస్ (Albertus Magnus) మొదటి సారిగా ఆర్సెనిక్ ట్రై సల్పైడ్ సమ్మేళనాన్ని సబ్బుతో కలిపి వేడి చెయ్యడం ద్వారా ఈ మూలకాన్నివేరు చేసినట్లు విశ్వసిస్తున్నారు 1649 లో జోహాన్న్ స్క్రో డేర్ (Johann Schröde ) రెండు రకాలుగా ఆర్సెనిక్‌ను వేరు చెయ్యుపద్ధతులను ప్రకటించాడు.