Sunday 2 October 2016

Argon(18)

ఆర్గాన్ ఒక రసాయనిక మూలకం.మూలకాల ఆవర్తన పట్టికలో 18 వ సమూహం (జడవాయువు/నోబుల్ గ్యాసెస్)లో p –బ్లాకునకు, 3 వ పెరియాడ్‌కు చెందిన మూలకం. ఆర్గాన్ మూలకం యొక్క పరమాణు సంఖ్య18 . సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇది వాయురూపంలో ఉండును.భూ వాతావరణంలో సాధారణంగా లభించువాయువు లలో ఆర్గాన్ మూడవది.వాతావరణంలో దీని లభ్యత 0.93% (9300 ppm ).ఇది వాతావరణంలో ఉన్న బొగ్గుపులుసు వాయువు కన్న(390 ppm) 23.7 రెట్లు ఎక్కువ. అలాగే వాతావరణంలో పుష్కలంగా లభించు నియాన్ (18 ppm)కన్న 500 రెట్లు అధికం.

ఆర్గాన్ అను పదం గ్రీకు పదం ‘’’ αργον, ఇది αργος పదానికి తటస్థ ఏకవచన రూపం.ఈపదానికి సోమరి, లేదా బద్ధకమైన, జడమైన అని అర్థం. ఈ మూలకం ఎటువంటి రసాయనిక చర్యల పదర్శించక పోవుటయే ఇందుకు కారణం. పరమాణు యొక్క బయటి వర్తులగదిలో 18 ఎలక్ట్రానులు ఉండి,స్థిరముగా ఉండి ఇతర మూలకాలతో చర్యారహితంగా ఉండును.

చరిత్ర

1785 లైన్ హెన్రీ క్వావేన్డిష్ గాలిలో ఉన్నట్లుగా గుర్తించాడు, కాని గాలినుండి వేరు చెయ్యలేకపోయాడు. 1894 లో యూనివర్సిటి కాలేజి లండన్‌నందు లార్డ్ రేలిగ్ (Lord Rayleigh) మరియు సర్ విలియమ్ రామ్సే (William Ramsay )లు తమ ప్రయోగంలో శుద్ధమైన గాలిలోని నీరు,ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ మరియు నైట్రోజన్ వాయువులను పూర్తిగా తొలగించి, పరిక్షిచి, వాతావరణంలోని గాలితో నత్రజని వాయువు తోపాటు మరో వాయువు ఉన్నట్లు నిర్ధారించారు .

ఉనికి-లభ్యత

వాతావరణంలో ఉండు ఆర్గాన్ రేడియో జేనిక్ ఆర్గాన్-36 రకానికి చెందినది. భూమి ఉపరితలం లోని పొటాషియం -40 ఐసోటోపు క్షయికరణ వలన ఆర్గాన్ రేడియో జేనిక్ ఆర్గాన్-36 ఏర్పడినది. విశ్వంలో సాధారణంగా అస్తిత్వంలో ఉన్నఆర్గాన్ వాయువు ఐసోటోపు ఆర్గాన్-36. ఆర్గాన్ ఐసోటోపు విశ్వంలోని నక్షత్ర మండలంలో సూపరునోవాలలో కేంద్రక సంలీనత వలన ఉత్పత్తి అయినది. భూ ఉపరితల మన్నులో ఉన్న ఆర్గాన్ 0.00015%. భూ వాతావరణంలోఘనపరిమాణం అయ్యినచో 0.934%, భారం అయినచో 1.288% పరిమాణంలో ఉన్నది. శుద్ధమైన ఆర్గాన్ వాయువును పారిశ్రామికంగా ఉత్పత్తి చేయుటకు గాలి యే ముడి సరుకు. భూమి మట్టిలో 1.2 ppm, సముద్ర నీటిలో 0.45 ppmలో వరకు ఉన్నది. క్రయోజనిక్ ఫ్రాక్చనల్ డిస్టిలేసన్ పధ్ధతిలో ఆర్గాన్ వాయువును గాలినుండి ఉత్పత్తి చెయ్యుదురు.ఈ డిస్టిలేసన్ పద్ధతిలోనే గాలినుండి నైట్రోజన్,ఆక్సిజన్, నియాన్,క్రిప్టాన్, జెనొన్ వాయువులను ఉత్పత్తి చెయ్యుదురు.