Monday 3 October 2016

Fluorine (9)

ఫ్లోరిన్

ఫ్లోరిన్ (లాటిన్ : అర్థం "ప్రవహించు"), అనేది ఒక వాయు రూపంలో ఉండే మూలకము. దీని సంకేతము F మరియు పరమాణు సంఖ్య 9. రసాయనిక చర్యలలో అతి చురుకుగా పాల్గొంటుంది. స్వచ్ఛమైన స్థితిలో ఫ్లోరిన్ లేత గోధుమ రంగులో ఉండే విష వాయువు. దీని రసాయనిక ఫార్ములా F2. అన్ని ఇతర హాలోజన్ మూలకాల వలె ఇది కూడా చాలా ప్రమాదకరమైనది. తాకగానే చర్మాన్ని కాల్చుతుంది. కర్బనము తో దీని మిశ్రమాలు ఫ్లోరోకార్బన్లు చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు.

ఉపయోగాలు

1) రసాయనిక ఉపయోగాలు:

1) ఫ్లోరిన్ మూలకం సెమీ కండక్టర్ల తయారీలో ప్లాస్మా ఎచింగ్ కోసం.
2) హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం (రసాయన ఫార్ములా: HF) గాజు పలకల మీద డిజైన్లు తయారుచేసే ఎచింగ్ పనికోసం ఉపయోగిస్తారు.
3) ఫ్లోరిన్ టెఫ్లాన్ అనే ప్లాస్టిక్ పదార్ధాలు మరియు ఫ్రియాన్ ల తయారీలో ఉపయోగిస్తారు.
4) యురేనియమ్ హెక్సాఫ్లోరైడ్ నుండి యురేనియం ను శుద్ధిచేయడానికి ఫ్లోరిన్ ఉపయోగిస్తారు.
5) హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్లు ఎయిర్ కండిషన్లు మరియ్ రిఫ్రిజిరేటర్లులో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఓజోన్ పొర విధ్వంశకాలుగా గుర్తించి వీటిని ఈ మధ్యకాలంలో నిషేధించారు. క్లోరిన్ మరియు బ్రోమిన్ ల వలె కాక ఫ్లోరిన్ ఈ విషయంలో చాలా సురక్షితమైనది
6) సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ వాయువును అతి శక్తివంతమైన విద్యుత్ పరికరాలలో ఇన్సులేటర్ గా ఉపయోగిస్తారు.
7) సోడియమ్ హెక్సాఫ్లోరో అల్యూమినేట్ (క్రయోలైట్) ను అల్యూమినియం విద్యుద్విశ్లేషణంలో ఉపయోగిస్తారు.
8) సోడియం ఫ్లోరైడ్ చాలా ఎక్కువ మోతాదులో ఉపయోగించి బొద్దింకలను చంపడానికి ఉపయోగిస్తారు.
9) ఫ్లోరైడ్లు పాతకాలంలో ద్రవరూపంలోని లోహాలు సులువుగా ప్రవహించడానికి ఉపయోగించేవారు.
10) US స్పేస్ శాస్త్రవేత్తలు తొలిరోజులలో ఫ్లోరిన్ వాయువును రాకెట్లకు ఇంధనంగా ఉపయోగపడుతుందని భావించినా ప్రయోగాలు ఫలించలేదు.

దంత మరియు వైద్య ఉపయోగాలు:

1) సోడియమ్ ఫ్లోరైడ్ (NaF), స్టానస్ ఫ్లోరైడ్ (SnF2) మరియు సోడియమ్ మోనోఫ్లొరోఫాస్ఫేట్, దంతవైద్యులు టూత్ పేస్టులలో ఉపయోగించి దంతాలకు కేరీస్ వ్యాధి సోకకుండా చేశారు.
2) శస్త్రచికిత్సలో ఉపయోగించే మత్తు మందు వాయువులుగా సెవోఫ్లోరేన్, డెస్ ఫ్లురేన్, ఐసో ఫ్లురేన్ మొదలైనవి ఉపయోగంలో ఉన్నాయి.
3) డెక్సామిథసోన్ మరియు ట్రయామ్సినలోన్ లు అతి శక్తివంతమైన కార్టికోస్టీరాయిడ్లుగా ఉపయోగపడే మందులు.
4) ఫ్లూడ్రోకార్టిసోన్ మినరలోకార్టికాయిడ్ గా చాలా సందర్భాలలో వైద్యంలో ఉపయోస్తారు.
5) ఫ్లూకొనజోల్ చర్మానికి చెందిన మరియు ప్రమదకరమైన శిలీంద్రాలకు సంబంధించిన వ్యాదులను అరికట్టడానికి మరియు నిర్మూలించడానికి ఉపయోగిస్తారు.
6) క్వినొలోన్లు ఒక ముఖ్యమైన ఏంటీబయాటిక్స్ కుటుంబానికి చెందినవి.
7) 18F, ఒక రేడియోధార్మిక ఐసోటోపు పోసిట్రాన్లను విడుదల చేస్తుంది. వీటిని పోజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పెట్) స్కాన్ లో ఉపయోగిస్తారు.