Sunday 2 October 2016

Vanadium (23)

వెనేడియం (Vanadium) ఒక రసాయన మూలకము. దీని సంకేతము V. పరమాణు సంఖ్య 23. దీనిని ఆండ్రే మాన్యుల్ డెల్ రియో అనే శాస్త్రవేత్త 1801లో కనుగొన్నాడు. అప్పుడు ముందుగా panchronium అనీ, తరువాత erythronium అనీ పేర్లు పెట్టాడు. 1831లో నిల్స్ గాబ్రియెల్ సెఫ్‌స్ట్రామ్ అనే శాస్త్రవేత్త మళ్ళీ కనుక్కొని , వెనాడిస్ అనే దేవత పేరుమీద "వెనేడియం" అని పేరు పెట్టాడు. ప్రకృతి సిద్ధంగా ఇది 65 వివిధ ఖనిజాలలోను (minerals), శిలాజ ఇంధనాలు(fossil fuel) లోను లభిస్తుంది. చైనా, రష్యా దేశాలలో దీనిని అధికంగా ఉక్కు బట్టీ పొర్లుద్రవం (steel smelter slag) నుండి ఉత్పత్తి చేస్తున్నారు. ఇతర దేశాలు heavy oil flue dust పై ఆధారపడుతున్నారు.

వెనేడియం లోహం మెత్తనిది, సాగదీయడానికి వీలైంది. (soft and ductile). ప్రత్యేకమైన ఉక్కు రకాల తయారీలో దీనిని వాడుతారు. (High speed steel). వెనేడియం పెంటాక్సైడ్ అనే పదార్ధాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీలో ఉత్ప్రేరకంగా వాడుతారు. అనేజ జీవుల శరీరాలలో వెనేడియం పదార్ధాలు ఉన్నాయి. కాని మానవుల శరీరాలలో ఉండవు.