Monday 3 October 2016

Oxygen (8)


ప్రాణ వాయువు (ఆంగ్లం:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటె ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. భూమి మీద వృక్ష జంతు సంపదకి ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ప్రాణ వాయువును గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.

సంకేతం,ఫార్ములాసవరించు

ప్రాణ వాయువు యొక్క సంకేతం "O", మరియు అణు ఫార్ములా "O2".

చరిత్రసవరించు

స్వీడన్ దేశస్తుడైన షీలే మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు 1 ఆగష్టు 1774 తేదీన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్ధతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి 'ఆక్సిజన్ ' అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.

భౌతిక ధర్మాలు

ఈ వాయువుకు రంగు, రుచి, వాసన ఉండవు.దహన శీలి కాదు. దహన దోహదకారి.ఇది గాలి కంటె కొంచెం బరువైనది.ఇది నీటిలో కరుగును.ఇది లిట్మస్ కు తటస్థంగా ఉండును.

ఉపయోగాలు

జీవరాశుల మనుగడకు అత్యంతము అవసరమైన మూలకము.ఆక్సి ఎసిటిలీన్, మరియు ఆక్సీ హైడ్రోజన్ మంటలను పొందుటకు ఉపయోగిస్తారు.పర్వతారోహకులకు ఆక్సిజన్ అత్యవసరము.సముద్ర అంతర్భాగంలో పరిశోధనలు చేయువారికి అవసరము.అంతరిక్షంలో పరిశోధనలు చేయు వైజ్ఞానికులకు ద్రవరూప ఆక్సిజన్ అవసరం.ప్రమాదాలు జరిగినపుడు, రోగి శ్వాస తీసుకోలేని పరిస్థితులలో ఆక్సిజన్ అవసరం.అప్పుడే పుట్టిన శిశువులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినపుడు, ఆక్సిజన్ గల ఇంక్యుబేటర్లలో ఉంచుతారు.