Sunday 2 October 2016

Silicon(14)

                                        
సిలికాన్ (Silicon) ఒక మూలకము.

దీని సాంకేతిక సూచిక 'Si మరియు పరమాణు సంఖ్య14. విశ్వంలో 8వ స్థానంలోని మూలకము. ఇవి అంతరిక్షంలోని ధూళి, గ్రహాలు అన్నింటిలోను విస్తృతంగా సిలికా మరియు సిలికేట్లుగా లభిస్తుంది. భూమి కేంద్రంలోని అత్యధికంగా 25.7% ఉండి, భూమి పైన రెండవ స్థానంలోని పదార్థము.

సిలికాన్ చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఖచ్ఛితంగా పనిచేసే లక్షణం మూలంగా సిలికాన్ ను సెమీకండక్టర్లు తయారీలో, మైక్రోఛిప్స్తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. సిలికా మరియు సిలికేట్లు గాజు, సిమెంట్, పింగాణీవస్తువులన్నింటిలో ఉపయోగపడుతుంది.

ప్రకృతిలో

భూమి కేంద్రంలో 25.7% సిలికా ఉంటుంది. భూమి మీద రెండవ అత్యధిక మూలకం (మొదటిది ఆమ్లజని). సిలికాన్ అరుదుగా స్వచ్ఛమైన రూపంలో లభిస్తుంది. ఇది ఎక్కువగా సిలికాన్ డయాక్సైడ్ (దీన్నే సిలికాఅంటారు) మరియు సిలికేట్లుగా లభిస్తుంది.

సిలికా వివిధ స్ఫటికాల రూపంలో లభిస్తుంది. ఇసుక, అమెథిస్టు, అగేట్, క్వార్ట్జ్, రాయి, ఒపాల్ మొదలైనవి. వీటిని లిథోజెనిక్ సిలికా అంటారు.

సిలికేట్లు అనేవి సిలికాన్, ఆమ్లజని మరియు ఇతర మూలకాలు కలిసిన మిశ్రమము. ఇవి మట్టి, ఇసుక మరియ్ కొన్ని రకాల రాళ్ళులో ఉంటాయి. గ్రెనైట్, సున్నపురాయి, ఆస్బెస్టాస్, మైకా కొన్ని సిలికేట్ మూలకాలు.

వ్యాధులు

సిలికోసిస్: సిలికాన్ ధూళి పీల్చడం మూలంగా రాళ్ళు కొట్టే వాళ్ళలో వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి.