Monday, 16 May 2016

మిలమిల మెరిసే మిణుగురు చేపలు కథ ఏమిటి?


మిలమిల మెరిసే మిణుగురు చేపలు కథ ఏమిటి? , Florocent Fish story What?

చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసు... కానీ మిణుగురుల్లా... రాత్రి పూట వెలిగే చేపల్ని చూశారా? అదే ఫ్లోరోసెంట్‌ ఫిష్‌!

అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా? తైవాన్‌లో సందడి చేస్తున్నాయి. మరి ఇన్నాళ్ల నుంచి ఎందుకు మన కంటపడకుండా తిరిగాయబ్బా? ఏ సముద్రం అడుగునో దాక్కున్నాయా? కాదు. ఈ చేపల్ని శాస్త్రవేత్తలే సృష్టించారు. జన్యు మార్పిడి విధానం తెలుసుగా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే. ఇంతకీ ఎందుకీ ప్రయోగం? ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల జంతువుల్లోను, మనుషుల్లోను జన్యుపరంగా వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుస్తుంది.

సుమారు ఆరు అంగుళాల వరకు పెరిగే ఏంజెల్‌ చేపల్ని తీసుకుని ప్రయోగాలు చేసి, వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. అంటే ఇప్పుడు వీటి పేరు ఏంజెల్‌ ఫ్లోరోసెంట్‌ ఫిష్‌ అన్నమాట. తైవాన్‌లో ఓ బయోటెక్నాలజీ సంస్థ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. మరి ఈ ప్రయోగాలు అంతక్రితం ఏవీ జరగలేదా? నిజానికి 2001లోనే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు విరజిమ్మలేదు. తర్వాత ఏడేళ్లు శ్రమించి ఏంజెల్‌ చేపల శరీరం మొత్తం మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకి కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం అయిదు తరాల వరకు ఈ జన్యు లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అంటే వీటి మనుమలు, మనవరాళ్లు కూడా వాటి తాతల్లాగే వెలిగిపోతాయన్నమాట. మరి వీటిని వండుకుని తినచ్చా? ఓ నిక్షేపంలా. మిగతా చేపల్ని తిన్నట్టే వీటినీ లొట్టలేసుకుంటూ ఆరగించొచ్చు. కాకపోతే ధరే ఎక్కువ. ఒక్కోటి రూ.1300 పలకొచ్చని అంచనా. ఇంకో రెండేళ్లలో వీటిని అక్వేరియాల్లో పెంచుకోవచ్చు.

మీకు జెల్లీ ఫిష్‌ తెలుసుగా? దానిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు మెరుస్తూ కనిపించడానికి కారణం దాంట్లో సహజంగా ఉండే ఫ్లోరోసెంట్‌ మాంసకృత్తులే. దాన్ని వేరు చేసి ఈ చేపల్లో ప్రవేశపెట్టారన్నమాట. అన్నట్టు... ఈ జన్యువును గతంలో పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వాటికి కూడా శరీరంలోని కొద్ది భాగం మాత్రమే వెలుగులీనింది. ఇప్పుడు ఈ ఏంజెల్‌ చేపలు మాత్రం పూర్తి స్థాయిలో మెరిసిపోతూ ముచ్చట కలిగిస్తున్నాయి.
www.bhaskerdesh.in

Sunday, 15 May 2016

మొక్కల్లో మాంసాహారాన్ని తీసుకునేవి ఉంటాయని విన్నాను. నిజమేనా?


ప్రశ్న:
మొక్కల్లో మాంసాహారాన్ని తీసుకునేవి ఉంటాయని విన్నాను. నిజమేనా?

జవాబు:
కొన్ని మొక్కల్లో కీటకాలను ఆకర్షించి, బంధించే వ్యవస్థ ఉన్నవి ఉన్నాయి. బంధించిన కీటకాలను ఎంజైములు, బ్యాక్టీరియా సాయంతో జీర్ణించుకునే వీలు వాటిలో ఉంటుంది. ఇలాంటి మొక్కలను మాంసాహారపు మొక్కలు (carnivorous plants) అంటారు.

ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా ఉండే ఇలాంటి మొక్కల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఉదాహరణకు వీనస్‌ ఫ్త్లెట్రాప్‌ అనే మొక్క ఆకులు తెరిచిన దోసిలిలాగా అమరి ఉంటాయి. వాటి అంచుల్లో సన్నని వేళ్లలాంటి కాడలు ఉంటాయి. ఆకుల లోపలి గ్రంథులు సువాసనలను వెదజల్లే స్రావాలను విడుదల చేస్తాయి. అందువల్ల ఆకర్షితమైన కీటకాలు ఆకుల మధ్యకు చేరుకోగానే, అంతవరకూ దోసిలిలా ఉండే భాగాలు చటుక్కున మూసుకుపోతాయి. అంచుల్లో ఉండే కాడలు కూడా మనం వేళ్లను బిగించినట్టుగా బిగిసిపోతాయి. దాంతో లోపలి కీటకం ఎటూ తప్పించుకోలేదు. ఆకుల లోపలి భాగంలో స్రవించే ఎంజైములు, ఆమ్లాల వల్ల కీటకం శరీరం విచ్ఛిన్నమై ద్రవరూపంలోకి మారుతుంది. మొక్క దాన్ని శోషించుకుంటుంది. ఇలా దొన్నెల్లాగా, మూతల్లాగా రకరకాల ఆకారాల్లో ఉండే ఈ మాంసాహార మొక్కల్లో కొన్ని చిన్న చిన్న జంతువులను సైతం పట్టి అరాయించుకునే శక్తి కలవి ఉంటాయి.

www.bhaskerdesh.in
www.shasthra101.blogspot.In

ఈత రాని చేపలుంటాయా?


ఈత రాని చేపలుంటాయా? , Fish can not swim ?

చేప అంటే నీటిలో ఈది తీరాలిగా? కానీ ఈతరాని చేపలున్నాయంటే నమ్ముతారా! అవును *హాండ్‌ ఫిష్‌లు* ఆ రకమే. ఇవి ఈదలేవు. మరేం చేస్తాయి? సముద్రం అట్టడుగు మట్టంపై చేతులతో నడుస్తాయి. చేపకు మొప్పలుంటాయి కానీ చేతులేంటి? అదే వీటి ప్రత్యేకత. వీటికి మొప్పల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉంటాయి. అచ్చం చిన్న చిన్న చేతుల్లాగా. వాటితో నడుస్తాయి. ఆస్ట్రేలియా సముద్రాల్లో మాత్రమే కనిపించే ఈ నడిచే చేప ఈదలేకపోడానికి కూడా కారణం ఇదే. ఇవి ఇలా నడచుకుంటూ నీటి అడుగున ఉండే క్రస్టసీన్‌లు, చిన్నచిన్న జీవులు కనిపిస్తే గుటుక్కుమనిపిస్తుంటాయి. అందుకే దీనికి 'హాండ్‌ ఫిష్‌' అని పేరొచ్చింది. ఈ మధ్యే వీటిల్లో 9 కొత్త జాతుల్ని కనుగొన్నారు. మొత్తం 14 జాతులున్నాయి.

ఈ చేప ఎంతుంటుందో తెలుసా? నాలుగు అంగుళాలు అంటే 10 సెంటీమీటర్లు. చూడ్డానికి రంగురంగుల్లో భలే అందంగా కనిపించే ఈ చేపల్లో పింక్‌ హాండ్‌ ఫిష్‌ అనే దానిపై ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేసి హడావుడి చేశారు. ఎందుకో తెలుసా? అక్కడి సముద్రాల్లో జీవ వైవిధ్యం బాగా దెబ్బతింటోందిట. అలా ముప్పు పొంచిన ఉన్న జీవుల్లో మొదటి స్థానంలో ఉంది ఈ చేపే మరి.

ఎప్పుడో 17ఏళ్ల క్రితం 1999లో కనిపించిన ఈ జాతికి చెందిన పింక్‌ హాండ్‌ ఫిష్‌ మళ్లీ ఇప్పుటి వరకూ జాడలేకుండా పోయిందంటే ఇవెంత ప్రమాదస్థితిలో ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోయాయి.

*బ్యాట్‌షిఫ్‌ కూడా..*
ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్‌ఫిష్‌లు కూడా ఉన్నాయి. వీటిల్లో రెండు కొత్త జాతుల్ని మెక్సికోలోని సముద్ర
తీరంలో కనుగొన్నారు. మన అరచేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉండే ఇవి అట్టడుగున సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజాల్లాంటి మొప్పలు ఉన్నాయి. అదాటున చూస్తే గబ్బిలం నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే వాటికి బ్యాట్‌ఫిష్‌ అని పేరొచ్చింది. గల్ఫ్‌ తీరంలో డీజిల్‌, పెట్రోల్‌ అవశేషాలు సముద్రంలో కలుస్తాయి కదా, వాటి వల్ల ఈ చేపలు చాలా ప్రమాదంలో పడ్డాయి. వీటి ఆహారమైన ప్లాంక్‌టన్‌లు విషపూరితమైపోతున్నాయి. అలాగే వాటి గుడ్లు కూడా పిల్లలవ్వకుండానే చనిపోతున్నాయి.

www.bhaskerdesh.in

రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?

ప్ర : రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?

జ : శరీరము లో రక్తము తీసుకువెళ్ళేవి రక్తనాళాలే అయినా వీటిలో ప్రవహించే రక్తము , నాళము నిర్మాణము బట్టి వాటిని ధమనులు , సిరలు అని వేరు వేరుగా గుర్తిస్తారు. శరీరబాగాలనుండి చెడు (ఆక్షిజన్‌ తక్కువైన) రక్తాన్ని గుండెకు తీసుకొని వచ్చేవాటిని సిరలుగాను , ఆక్షిజన్‌ తో కూడుకొని స్వచ్చమైన మంచి రక్తాన్ని గుండెనుండి  శరీరభాగాలకు మోసుకుపోయే వాటిని ధమనులు గాను అంటారు . వీటన్నింటిలోనూ గోడలు మూడు పొరలతో నిర్మించబడినా ధమనుల గోడలు , సిరల గోడలుకన్నా మందముగా ఉంటాయి. ధమనులలో రక్తము గులాబీ రంఫులో వేగము గా ప్రవహిస్తుంది. సిరలలో రక్తము కాఫీ డికాక్షన్‌ రంగులో ఉండి నెమ్మదిగా ప్రవహిస్తుంది. సిరలలో రక్తప్రవాహము వెన్నకి జరుగకుండా కవాటాలు ఉంటాయి. ఇక్కడ పల్మొనరీ ధమనులలో చెడురక్తము , పల్మొనరీ సిరలలో మంచిరక్తము ఉండటాన్ని గమనించగలరు. 


www.bhaskerdesh.in
ప్ర : రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?

జ : శరీరము లో రక్తము తీసుకువెళ్ళేవి రక్తనాళాలే అయినా వీటిలో ప్రవహించే రక్తము , నాళము నిర్మాణము బట్టి వాటిని ధమనులు , సిరలు అని వేరు వేరుగా గుర్తిస్తారు. శరీరబాగాలనుండి చెడు (ఆక్షిజన్‌ తక్కువైన) రక్తాన్ని గుండెకు తీసుకొని వచ్చేవాటిని సిరలుగాను , ఆక్షిజన్‌ తో కూడుకొని స్వచ్చమైన మంచి రక్తాన్ని గుండెనుండి  శరీరభాగాలకు మోసుకుపోయే వాటిని ధమనులు గాను అంటారు . వీటన్నింటిలోనూ గోడలు మూడు పొరలతో నిర్మించబడినా ధమనుల గోడలు , సిరల గోడలుకన్నా మందముగా ఉంటాయి. ధమనులలో రక్తము గులాబీ రంఫులో వేగము గా ప్రవహిస్తుంది. సిరలలో రక్తము కాఫీ డికాక్షన్‌ రంగులో ఉండి నెమ్మదిగా ప్రవహిస్తుంది. సిరలలో రక్తప్రవాహము వెన్నకి జరుగకుండా కవాటాలు ఉంటాయి. ఇక్కడ పల్మొనరీ ధమనులలో చెడురక్తము , పల్మొనరీ సిరలలో మంచిరక్తము ఉండటాన్ని గమనించగలరు. 

నాటిన అన్ని గింజలూ మొలకెత్తవు, ఎందుకు?

ప్రశ్న: నాటిన అన్ని గింజలూ మొలకెత్తవు, ఎందుకు?


జవాబు: నాటిన గింజ మొలకెత్తాలంటే ఆ గింజలో ఫలజీవం సజావుగా ఉండాలి. సాధారణంగా పూర్తిస్థాయి క్రోమోజోములున్న సంయుక్త జీవ కణం (Zygote) విత్తనంలో ఉంటుంది. విత్తనం మొలకెత్తగానే కిరణజన్య సంయోగక్రియ జరపలేదు కాబట్టి సొంతంగా ఆహారం తయారు చేసుకునేంతవరకు తన ఎదుగుదలకు సహాయ పడేలా విత్తనంలో పోషణ ఉండాలి. అందుకే విత్తనాలలో సంయుక్త బీజకణ లక్షణాలతోపాటు పప్పు, కొబ్బరి, ముట్టె వంటి భాగాల్లో ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి క్షీణించి ఉన్నాగానీ, రసాయనిక కారణాల వల్లగానీ, జన్యులోపం వల్ల గానీ అధిక వేడివల్లగానీ తదితర కారణాల వల్ల విత్తనంలో ఉన్న జీవం నశించి ఉంటే అలాంటి విత్తనాలు మొలకెత్తవు.
అందుకే రైతులు విత్తనాల కోసం ప్రభుత్వాన్ని అర్థిస్తుంటారు. తాము పండించిన విత్తనాలు తిరిగి పంటకొచ్చే అవకాశం లేకపోవచ్చు లేదా, టెర్మినేటర్‌ సీడ్స్‌ అనే విత్తనాల్లో అన్నీ బాగున్నాగానీ, వీటి క్రోమోజోముల్లో కంపెనీల వాళ్లు కావాలనే జన్యు నిర్మాణం చేయడం వల్ల మొలకెత్తవు కాబట్టి జన్యులోపం లేకుండా, ఆహార సమృద్ధి బాగా ఉంటూ సజీవంతో ఉన్న విత్తనాలే మొలుస్తాయి. ఒక్కోసారి విత్తనాలు బాగున్నా నేలలో ఉండే సారం విత్తనం మొలకెత్తేందుకు అనువుగా లేకున్నా ఆ ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్తవు.


www.bhaskerdesh.in

తాగిన వ్యక్తిపై నీళ్లు కుమ్మరిస్తే మత్తు దిగిపోతుందని అంటారు. నిజమేనా?

ప్రశ్న: తాగిన వ్యక్తిపై నీళ్లు కుమ్మరిస్తే మత్తు దిగిపోతుందని అంటారు. నిజమేనా?

జవాబు: తాగుబోతులు తాగే ద్రావణంలో నీరు అధికంగానూ, ఇథైల్‌ ఆల్కహాలు కొద్దిగానూ ఉంటాయి. ఆల్కహాలు మోతాదునుబట్టి ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడుతుంది. ఇథైల్‌ ఆల్కహాలుకు తనంత తానుగా మత్తును కలిగించే గుణం లేదు. తాగినప్పుడు ఏ జీర్ణ ప్రక్రియ అవసరం లేకుండానే కొద్దిసేపటికే రక్తంలో కలిసే గుణం దీనికి ఉంది.

రక్తంలో కలిసిన వెంటనే అది దేహంలోని కణ జాలాల్లోకి బాగా త్వరితంగా చేరుకోగలుగుతుంది. కణాల్లోకి వెళ్లక అది సాధారణంగా అసిటాల్డిహైడుగా మారుతుంది. సారాయి తాగిన వాళ్ల దగ్గర్నుంచి వెలువడే దుర్గంధం దీనిదే. ఇది మెదడు కణాల్లోని అమైనో ఆమ్లాలలో చర్య జరిపి మత్తును, కైపును కలిగిస్తుంది.

తీసుకున్న మోతాదును బట్టి ఆ తాగుబోతు ప్రవర్తన, శరీర క్షేమం ఆధారపడ్తాయి. సారాయి, అసిటాల్డిహైడ్‌ నీటిలో బాగా కరుగుతాయి. మత్తులో జోగుతున్న మనిషి మీద బకెట్టు నీళ్లు పోస్తే అవి బట్టలను తడపడం వల్ల చాలా సేపు చర్మం చెమ్మగా ఉంటుంది కాబట్టి కనీసం చర్మంలో ఉన్న కణాల్లోని ఆల్కహాలు సంబంధిత రసాయనాలు బయటపడతాయి. ఒక్కసారిగా శరీర ఉపరితల ఉష్ణోగ్రత మారడం వల్ల కూడా ఆల్కహాలు ప్రభావం తగ్గుతుంది.


www.bhaskerdesh.in