Sunday 2 October 2016

Iron(26)

ఇనుము (ఆంగ్లం: Iron) ఒక మూలకము మరియు లోహము. దీని రసాయన సంకేతము Fe (లాటిన్: ferrum) మరియు పరమాణు సంఖ్య 26. ఇనుము వెండిలా మెరుస్తున్న మెత్తని లోహం. ఇనుము మరియు నికెల్ గ్రహాల కేంద్రాలలో ముఖ్యమైన పదార్ధము.

ఆహారంలో ఇనుము
శరీరములోఇనుము అవశ్యకత

Iron in human body, ఇనుము అవశ్యకత శరీరములో

ఇనుము (ఆంగ్లం: Iron) ఒక మూలకము మరియు లోహము. దీని రసాయన సంకేతము Fe (లాటిన్: ferrum) మరియు పరమాణు సంఖ్య 26. ఇనుము వెండిలా మెరుస్తున్న మెత్తని లోహం. ఇనుము మరియు నికెల్ గ్రహాల కేంద్రాలలో ముఖ్యమైన పదార్ధము.

ఆహారంలో ఇనుము

ఇనుము కలిగిన ముఖ్యమైన ఆహార పదార్ధాలు మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, బెల్లం మొదలైనవి. ఆహారంలో ఇనుము లోపించడం మూలంగా రక్తహీనత కలుగుతుంది.

మన శరీరంలో ఇనుము పాత్ర చాలా కీలకమైంది. అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేయటంలో, కణాల పెరుగుదలలో దీని అవసరం ఎంతో ఉంది. శక్తిని అందించటం దగ్గర్నుంచి రోగ నిరోధక వ్యవస్థను సక్రమంగా ఉంచేంత వరకూ అన్నింటినీ ఇది ప్రభావితం చేస్తుంది. శరీరంలో తగినంత ఇనుము లేకపోతే నిస్సత్తువ ఏర్పడుతుంది. ఇక మరీ లోపిస్తే తీవ్రమైన రక్తహీనతకు దారి తీస్తుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి గణనీయంగా క్షీణిస్తుందని కార్నెల్‌ విశ్వవిద్యాలయం పరిశోధన వెల్లడించింది. ఇనుమును సరిపడినంతగా తీసుకుంటే మెదడు పనితీరు, జీవక్రియలు మెరుగవటంలో ఉపయోగపడుతుంది. అమెరికా వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం.. ఒక రోజుకి పురుషులకైతే 8 మి.గ్రా., యుక్తవయసు అబ్బాయిలకైతే 11 మి.గ్రా. ఇనుము అవసరపడుతుంది. అలాగే స్త్రీలు రోజుకి 18 మి.గ్రా., యుక్తవయసు అమ్మాయిలు 15 మి.గ్రా. ఇనుము తీసుకోవాలి. అదే గర్భిణులకైతే రోజుకి 27 మి.గ్రా. కావాలి.

ఆహారంలో ఇనుము లోపించడం మూలంగా రక్తహీనత కలుగుతుంది.-- శరీరంలోని వివిధ అవయవాలకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను రవాణా చేయటంలో ఇనుము ధాతువుదే ప్రధాన పాత్ర..ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఇనుము అత్యవసరం.శరీరంలో ఇనుము లోపించటాన్ని ‘అనీమియా’ అంటారు. మనదేశంలో పిల్లలు, కౌమారదశ బాలికలు, గర్భవతులు ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్య అనీమియా. సుమారు 50 శాతం జనాభా అనీమియాతో బాధపడుతున్నారు. దీని కారణంగా వయోజనుల్లో పనిసామర్థ్యం, పిల్లల్లో అభ్యాసన సామర్థ్యం తగ్గుతుంది.

వేటిల్లో లభిస్తుంది?

ఆహారంలో ఇనుము రెండు రూపాల్లో లభిస్తుంది. హీమ్‌ ఐరన్‌ జంతువుల ప్రోటీన్లలో, నాన్‌ హీమ్‌ ఐరన్‌ మొక్కల ద్వారా లభించే ప్రోటీన్లలో ఉంటుంది. నాన్‌ హీమ్‌ ఐరన్‌ కన్నా హీమ్‌ ఐరన్‌నే శరీరం బాగా గ్రహిస్తుంది.

ఇనుముధాతువు ఎక్కువగా ఇచ్చే అహారం :

ఆకుకూరలు, ఎండుఫలాలు, కాయధాన్యములు ఎక్కువగా ఇనుము కలిగి ఉంటాయి. రాగులు, సజ్జలు లాంటి చిరుధాన్యములు కూడా ఇనుముకు చక్కని ఆధారాలు. ఐతే ఆకుకూరల ద్వారా కేవలం 3 నుంచి 5 శాతం ఇనుమును మాత్రమే శరీరం గ్రహిస్తుందని గుర్తుంచుకోండి. * మాంసము, చేపలు, కోడి మాంసము/గుడ్డు నుంచి కూడా శరీరం ఇనుమును గ్రహిస్తుంది. * ఆకుకూరల ద్వారా లభించే ఇనుము శరీరంలో చక్కగా ఇమిడిపోవడానికి ఉసిరి, జామ లాంటి విటమిన్ సి పండ్లు తోడ్పడతాయి. * భోజనానికి ముందు/తర్వాత టీ, కాఫీ తాగరాదు. ఇనుము కలిగిన ముఖ్యమైన ఆహార పదార్ధాలు మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, బెల్లం మొదలైనవి.