Monday 3 October 2016

Nitrogen (7)

నత్రజని అనగా నైట్రోజన్ ఒక మూలకము.

నత్రజని

మాంసకృత్తులు, అమినో ఆమ్లాలు, వర్ణకాలు, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లు మొదలైన వాటిలో నత్రజని అతి ముఖ్యమైన పదార్ధము. వాతావరణంలోని గాలిలో ఇది 79 శాతం వరకు ఉంటుంది. వాయురూపంలో ఉన్న నత్రజనిని జీవులు ప్రత్యక్షంగా ఉపయోగించుకోలేవు. ఈ నత్రజని స్థిరీకరణం రెండు పద్ధతుల్లో జరుగుతుంది. జీవ సంబంధ పద్ధతిలో 90 శాతం మరియు రోదసీ వికిరణం ద్వారా 10 శాతం నత్రజనీకరణం జతుగుతుంది. మొదటి పద్ధతిలో నత్రజని లవణాలు కరిగి ఉన్న ద్రావణాల నుంచి మొక్కలు వాటికి కావలసిన మాంసకృత్తులను, అమినో ఆమ్లాలను తయారు చేసుకుంటాయి. ఇక రెండవ పద్ధతిలో మెరుపులు,ఉల్కాపాతం వంటి అత్యధిక శక్తివంతమైన కిరణాల వల్ల నైట్రోజన్, హైడ్రోజన్ తో కలసి అమోనియా ఏర్పడుతుంది.