Sunday 2 October 2016

Nickel(28)

నికెల్ఒక రసాయనిక మూలకం. మూలకాల ఆవర్తన పట్టిక లో సమూహం(group )10, D బ్లాకు,4 వ పెరియడునకు చెందిన లోహం.దీనియొక్క పరమాణు సంఖ్య28. కొద్దిగా బంగారుపు ఛాయకలిగిన వెండి లా తెల్లగా మెరిసే మూలక లోహం. నికెల్ ఒక పరివర్తన మూలకం. ఇది దృడమైనది, పలకలు, తీగలుగా సాగే స్వభావమున్నది.నికెల్ లోహం పెద్ద ముక్కలుగా , ముద్దగా ఉన్నప్పటి కన్న పుడిగా,ఎక్కువ ఉపరితల వైశాల్యం కలిగినప్పుడు ఎక్కువ చార్యాశీలత కనపరచును.

చరిత్ర

క్రీ.పూ.3500 సంవత్సరాల నాటికే ఉల్కాపాత జనితమైన సహజ నికెల్-ఇనుము మిశ్రమఖనిజాన్ని వాడినట్లు తెలుస్తున్నది. ఆనాటి, ప్రస్తుతం సిరియా గా పిలవబడే ప్రాంతంలో దొరికిన కంచు వస్తువులలో 2% వరకు నికెల్ లోహం ఉన్నది[3]. చైనాలోని లిఖిత వ్రాతప్రతులలో వ్రాసినదాని ప్రకారం తెల్లరాగి(రాగి-నికెల్ మిశ్రమ ధాతువు ,చైనాలో బై టోంగ్ ,baitong అందురు )ని క్రీ.పూ .1700-1400 మధ్య కాలంలో వాడినట్లు తెలుస్తున్నది. 17 వ శతాబ్దిలో ఈ తెల్లరాగిని బ్రిటన్‌కు ఎగుమతి చేసినట్లు తెలుస్తున్నది. అయితే 1822 వరకు ఇది ఒక ప్రత్యేక లోహమని తెలియరాలేదు

ప్రస్తుతం నికెలైన్ ,లేదా నికోలైట్ అనబడు ఎర్రని ముడిఖనిజాన్ని మధ్య జర్మనీ లోని Erzgebirge ప్రాంతంలో గుర్తిం చినప్పుడు, దానిని రాగి ఖనిజంగా భావించారు.దానినుండి 1751 లో బారోన్ ఆక్సిల్ ఫ్రెడ్రిక్ క్రాంస్ట్ద్( Axel Fredrik Cronstedt) ఈ ముడి ఖనిజం నుండి రాగిని ఉత్పత్తి చెయ్యటానికి ప్రయత్నించగా, తెల్లటి లోహం ఉత్పత్తి అయ్యినది. అనుకున్నదానికి భిన్నంగా వేరే లోహం ఉత్పన్నం కావటంతో దానికి జర్మనిపురాణ దయ్యం పేరు కాప్రోనికెల్ అనేపేరు ఈ కొత్త లోహనికి పెట్టాడు కావున Axel Fredrik Cronstedtనే నికెల్ ను కనుగొన్న రసాయన శాస్త్రవేత్తగా భావించాలి.

భౌతిక ధర్మాలు

ఇనుము, కోబాల్ట్ ,గాడోలీనియం తరువాత అయస్కాంత ప్రభావిత ధర్మాలుకలిగిన నాలుగవ మూలకం ఇది.ఈ లోహం యొక్క క్యూరీ (curie)యొక్క ఉష్ణోగ్రత 355౦C ,అనగా ఈ ఉష్ణోగ్రత దాటినతరువాత నికెల్ అయస్కాంత ప్రభావితం కాదు.పరమాణువుయొక్క పరమాణు వ్యాసార్థం 0.124 nm.అణు అమరిక ముఖ కేంద్రీయ ఘనాకృతి లో ఏర్పది,దీని అల్లికఅభీష్టపరిమాణం (lattice parameter) 0.352 nm లు ఉండును. నికెల్ పరావర్తక మూలకాల వర్గానికి చెందిన దృడమైన,రేకులుగా సాగే గుణమున్న లోహం.గది ఉష్ణోగ్రత వద్ద ,నికెల్ నెమ్మదిగా ఆక్సీకరణ చెందు స్వభావం కలిగి యున్నది. పెద్ద ముక్కలుగా ముద్దగా ఉన్నప్పుడు ఉపరితలంపై ఆక్సైడ్ పూత కప్పి ఉండటం వలన ఆక్సిజన్‌తో చర్య నెమ్మదిగా జరుగును. ఆక్సైడ్ పూత కలిగియున్నప్పటికి,ఈలోహం ఆక్సిజన్‌తో రసాయనిక చర్య లో కాస్త చురుకుగానే పాల్గోనును.