Monday 3 October 2016

Lithium (3)

లిథియం (ఆంగ్లం: Lithium)

ఒక క్షారమూలకం. ఇది ఒక లోహ మూలకం. మూలకాల ఆవర్తన పట్టికలో మొదటి సమూహం లేదా సముదాయానికి (group1)కు చెందిన మూలకం. సాధారణ పరిస్థితిలో ఘన రూపంలో ఉండూను. ఆవర్తనకాలం (period) రెండు, మరియు బ్లాకు S చెందినది. ఈ మూలకం యొక్క పేరు గ్రీకు పదమైన లిథోస్ (Lithos)నుండి వచ్చినది. లిథోస్ అనగా రాయి అని అర్థం .మూలకంలోని ఎలక్ట్రానుల సంఖ్య మూడు (3)

చరిత్ర

మొదటిగా 1790 లో Jozé Bonifácio de Andralda e Silva అనే బ్రెజిల్ దేశీయుడు లిథియం యొక్క ముడి ఖనిజం పేటలైట్ (petalite, LiAlSi4O10) ను స్విడిస్ యొక్క యుటో అనే దీవిలో గుర్తించాడు. మండించినప్పుడు ఇది క్రిమ్సన్ రంగుతో మండటం గుర్తించాడు. 1817 లో స్టాక్ హోమ దేశియుడు అయిన జోహన్ ఆగస్టు అర్ఫ్వేడ్సన్ (Johann August Arfvedson) అంతవరకు గుర్తించని కొత్త మూలకంగా గుర్తించి దానికి లిథియం అని పేరు నిర్ణయించాడు. ఇది కొత్త క్షార లోహామని, సోడియం కన్నతేలికగా ఉన్నదని గుర్తించాడు. అయితే సోడియంను వేరు చేసినట్లు, విద్యుత్ విశ్లేషణ ద్వారా లిథియంను వేరు చెయ్యలేక పోయాడు.1821లో విలియం బ్రాండ్ చాలా స్వల్వ మోతాదులో లిథియంని వేరు చెయ్యగలిగాడు. చివరకు 1855లో జర్మని రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ బున్సెన్ మరియు బ్రిటిషు శాస్త్రవేత్త ఆగస్టస్ మేథిస్సెన్‌తో కలిసి పెద్ద పరిమాణంలో లిథియంను విద్యుత్తు విశ్లేషణ పద్ధతిలో లిథియంను ముడిఖనిజం నుండి వేరుచెయ్యగలిగారు.