Thursday 13 October 2016

Arsenic (33)


ఆర్సెనిక్ అనునది ఒక రసాయనిక మూలకం..ఆవర్తన పట్టికలో ఇది 15 వ సమూహం, p బ్ల్లాకు, 4 వ పెరియాడ్‌కు చెందినది. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 33.మూలకంయొక్క రసాయనిక సంకేత అక్షరం As. ఈ మూలకం పలు ముడిఖనిజాలలలో, సాధారణంగాసల్ఫరు, మరియు ఇతర లోహాల ఖనిజాలతో కలిసి లభిస్తుంది . కొన్ని సందర్భాలలో శుద్ధమై మూలక స్పటికంగా కుడా లభ్యం. ఆర్సెనిక్ ఒక ఉపధాతువు (metalloid) . ఇది పలు రూపాంతరములు (allotropes) గా కుడా ఉంటుంది.ఇందులో బూడిద రంగుది పారిశ్రామికంగా ఉపయోగకరమైనది.

చరిత్ర

పురాతన కాలం నుండే ఆర్సెనిక్ సల్పైడులు (ఆర్పిమెంట్:orpiment, రిఅల్గర్:realgar) మరియు ఆక్సైడులు మానవ వినియోగంలో ఉన్నట్లుగా తెలియ వచ్చుచున్నది. జోసిమోస్ (సిర్కా 300 క్రీ.శ.) sandarach (realgar) నుండి ఆర్సెనిక్ అక్సైడును, దానినుండి ఆర్సెనిక్‌ను ఉత్పత్తి చెయ్యు పద్ధతిని వివరించాడు. ఆకాలంలో ఆర్సెనిక్ ను ప్రత్యర్థులను చంపుటకువిరివిగా వాడేవారు.ముఖ్యంగా పాలనలో ఉన్న వ్యక్తులను చంపుటకు వాడటం వలన దీనికి రాజుల విషం (poison of kings), విషరాజం (king of poisons) అని పిలేవారు. కంచుయుగంలో ఆర్సెనిక్‌ని కంచుకు దృఢత్వంకై, లోహతయారి సమయంలో కలిపేవారు.

• 1760 లో లూయిస్క్లాడ్ కాడేట్ డి గస్సికోర్ట్ (Louis Claude Cadet de Gassicourt) అను శాస్త్రవేత్త పొటాషియం అసిటేట్‌ను ఆర్సెనిక్ ట్రైఆక్సైడుతో చర్య జరిపించి కాడేట్ ఫ్యుమింగ్ లిక్విడ్ (Cadet's fuming liquid) అనుకార్బనిక లోహసమ్మేళనపదార్థాన్నిసృష్టించాడు.

ఆవిష్కారం

క్రీ.పూ.4 శతాబ్దిలో గ్రీకు తత్వవేత్త ఆరిస్టాటిల్ దీనిని సాండరాక్ (sandarach) అనినామకరణం చేసాడు. తదుపరి కాలంలో అతని శిష్యుడు థియోప్రశ్టాస్ (Theophrastus) దీనిని అర్హెనికం (arhenicum) అని నామకరణం చేసాడు. క్రీ.శ. 5 వ శతాబ్దిలో గ్రీకు చరిత్రకారుడు ఒలంపియోడొరస్, అర్సెనిక్ సల్ఫైడ్ను కాల్చి తెల్ల అర్సెనిక్‌ను తయారు చేసాడు (As2O3) 

క్రీ.శ.1250 లో అల్బెర్తుస్ మగ్నుస్ (Albertus Magnus) మొదటి సారిగా ఆర్సెనిక్ ట్రై సల్పైడ్ సమ్మేళనాన్ని సబ్బుతో కలిపి వేడి చెయ్యడం ద్వారా ఈ మూలకాన్నివేరు చేసినట్లు విశ్వసిస్తున్నారు 1649 లో జోహాన్న్ స్క్రో డేర్ (Johann Schröde ) రెండు రకాలుగా ఆర్సెనిక్‌ను వేరు చెయ్యుపద్ధతులను ప్రకటించాడు.