Sunday 2 October 2016

Potassium (19)

పొటాషియం అనునది ఒక రసాయనిక మూలకం. ఆవర్తన పట్టికలో 1వ సమూహం(group),4 వ అనువర్తిత పట్టిక (period), మరియు S బ్లాకునకు చెందిన మూలకం. దీని యొక్క పరమాణు సంఖ్య 19[3] . వెండిలా తెల్లగా ఉండు క్షారలోహము. నీటితో మరియు గాలి లోని ఆక్సిజనుతో చురుకుగా వేగంగా తీవ్రంగా రసాయనిక చర్య జరుపుతుంది.

చరిత్ర

పొటాషియం యొక్క ఉనికిని మొదటగా 1807 లో సర్ హంప్రీ డేవి గుర్తించాడు[3]. సంకేత పదం K. ఈ సంకేతపదం నియో లాటిన్ పదం kalium పదంలోని మొదటి అక్షరము K ను సంకేత పదంగా తిసుకోవడం జరిగినది.స్వాభావికంగా లభించే పొటాషియం మూడు ఐసోటో పులనుకలిగి ఉన్నది.అందులో40K అనునది రేడియో ధార్మికత(క్షకిరణవిసర్జనము)(radioactive)కలిగి ఉన్నది.సోడియం కుడా రసాయనికంగా పొటాషియంను పోలి ఉండటంవలన మొదట్లో ఈరెండింటిని ఒకటిగానే భావించేవారు.1702 లో వీటి నుండి ఎర్పడు లవణాలు భిన్నమైనవిగా ఉండటం గమనించారు. చివరకు 1807 లో విద్యుత్తు విశ్లేషణ ద్వారా ఈ రెండింటిని వేరు చెయ్యడం ద్వారా ఇవి వేరు వేరు మూలకాలని స్పష్టమైనది. ప్రకృతిలో పొటాషియం అయానిక్ లవణాలుగా లభిస్తుంది.

పొటాషియం అయానులు జీవకణాలలో అవసరం.జీవ వ్యవస్థలో పొటాషియం లోపం, తగ్గుదల వలన రకరకాల హృదయ సంబధిత వ్యాధులు సంక్రమించు అవకాశం ఉన్నది. మొక్కల కణజాలంలో పొటాషియం ఏర్పడు తుంది.తాజాపళ్ళు మరియు కాయగూరల లో పొటాషియం తగినంత లభిస్తుంది.ఈ కారణం చేతనే మొక్కల బూడిదనుండి పోటాషియంను గుర్తించి వేరుచేయ్యగలిగారు.మొక్కల బూడిద(potash) నుండి పొటాషియం లబించడం వలన ఈ మూలకానికి పొటాషియం అనే పేరు వచ్చింది.

లభ్యత

ఆహారంలో పొటాషియం లభ్యత సవరించు
ఆకుకూరలలో,పళ్ళలలో పొటాషియం తగినంతగా లభిస్తుంది.ఆరెంజి వంటి నిమ్మజాతి పళ్ళలో,ద్రాక్ష పళ్లలో,కారెట్,బంగాళదుంప,బ్లాక్ బెర్రిస్,spinach and collardsలలో లభిస్తుంది
అరటిపండు,పాలు,బాదం వేరుశనగపప్పు,మరియు అవకాడొ(Avocados)పళ్లు[5]

పొటాషియం ఉత్పత్తి

ఒక పద్దతిలో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద, వాతావరణ పీడనం వద్ద పొటాషియంయొక్క సమ్మేళన పదార్థంతో సోడియంను చర్య జరిపేలాచెయ్యడం వలన పోటాషియం ఏర్పడును.ఈ విధానంలో మొదట బ్యాచ్‌పద్ధతిలో ఉత్పత్తి చేసెవారు.ఇప్పుడు నిరంతర ఉత్పత్తి పద్ధతిలో పొటాషియంను తయారుచేయుదురు.ఈ విధానంలో ఒక ప్యాకెడ్ కాలమ్‌లోనికి కరగించిన పొటాషియం క్లోరైడును ప్రవేశపెట్టెదరు.అదేకాలమ్‌యొక్క దిగువభాగంనుండి సోడియం ఆవిరులను పైకి ప్రయాణించులా ప్రవేశపెట్టడం జరుగుతుంది.పొటాషియంక్లోరైడులోని క్లొరైడు పొటాషియంనుండి విడివడి సోడియంతో సంయోగం చెంది సోడియం క్లోరైడుగా మారడం వలన పొటాషియం విడిగా ఏర్పడుతుంది.ఏర్పడిన సోడియం క్లోరైడు(Nacl)ను ప్యాకెడ్ కాలమ్‌ దిగువభాగంనుండి చర్యసమయంలో ఎప్పడికప్పుడు తొలగించెదరు

పారిశ్రామిక రంగంలో ఉపయోగాలు

పొటాషియం మరియు దానియొక్క మిశ్రమ పదార్థాలను పలుపారీశ్రామిక ఉత్పత్తుల తయారిలో వాడెదరు.

1 గాజు/కాచము,మరియు సబ్బుల తయారిలో వాడెదరు
2 పొటాషియం హైడ్రాక్సైడ్ బలమైనగాఢ క్షారగుణములను కలిగి ఉన్న పొటాషియంయొక్క సమ్మేళన పదార్థం.దీనిని గాఢమరియు బలహీన అమ్లాలనుతటస్థికరించుటకు ఉపయోగింతురు.రకరకాలైన లవణాలను ఉత్త్పత్తి చేయుటయందు ఉపయోగిస్తారు.మరియు శాకనూనెల పరిశ్రమలో నూనెలలోని విడిగా ఉన్న కొవ్వు ఆమ్లాలను తొగించుటకు ఉపయోగిస్తారు.పొటాషియం సైనైడును బంగారు, వెండి వంటిలోహాలను కరగించుటకు ఉపయోగిస్తారు[
3)పొటాషియంక్రోమేట్‌ను ఇంకులు(ink),రంగులు,అగ్గిపెట్టెలు,బాణాసంచా వంటివి తయారుచేయుటలో ఉపయోగిస్తారు.

ఆరోగ్య పరంగా మానవునుకి పొటాషియం అవసరం

1 మానవునుకి అవసరమైనఖనిజాల్లో పొటాషియం ఒకటి.జీవవ్యస్థ సక్రమంగా నడచుటకుఅవరమైనఖనిజం పొటాషియం.నాడులు,కండరాలు ఒకదానితో నొకటి సంబంధంకలిగి స్పందించునట్లు చెయ్యును.ఇది కణజాలంలో పొషకాలు ప్రహించునట్లు చెయ్యును మరియు,వర్ధ్యాలను కణాలవెలుపలికి పంపును.ఆహారంలోని ఎక్కువ మోతాదు పొటాషియం,రక్తవత్తిడికికారణమైన సోడియం ను తగ్గించి,దాని ప్రభావవాన్నితగ్గిస్తుంది
పొటాషియం ముత్రపిండాలు,హృదయం ,తదితర మానవ అవయవాలు పనిచెయ్యుటకు చాలాఅవసరం