Thursday 13 October 2016

వేడి నీటి బుగ్గలు ఉంటాయని తెలుసు. మరి చల్లని నీటి బుగ్గలు కూడా ఉంటాయా? అసలివి ఎలా ఏర్పడతాయి?


ప్రశ్న: వేడి నీటి బుగ్గలు ఉంటాయని తెలుసు. మరి చల్లని నీటి బుగ్గలు కూడా ఉంటాయా? అసలివి ఎలా ఏర్పడతాయి?

జవాబు: భూమి లోతుల నుంచి భూ ఉపరితలానికి 'ఫౌంటెన్‌'లాగా వెదజల్లే చల్లని నీటి బుగ్గలు ఉంటాయి కానీ, వాటిని వేడి నీటి బుగ్గలతో పోల్చడానికి వీలు లేదు. భూమి లోపలి పొరల నుంచి వేడి నీరు హఠాత్తుగా భూమి ఉపరితలంపైకి చిమ్ముకురావడానికి కారణం ఆ నీరు అధిక ఒత్తిడికి గురి కావడమే. అయితే చల్లని నీరు పైకి చిమ్మడానికి కారణం ఒక విధమైన రసాయనిక చర్య. భూమి లోపల ఏర్పడే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది. భూగర్భంలో ఉండే గుహలలో కార్బన్‌ డయాక్సైడు విడుదలై అక్కడి నీటిలో కరిగిపోతే, వాయువుతో కూడిన కార్బానిక్‌ ద్రవం ఉత్పన్నమవుతుంది. ఈ ద్రవం భూ ఉపరితలానికి తన్నుకు వస్తుంది. చల్లని నీటి బుగ్గలు చూడడానికి వేడి నీటి బుగ్గలలాగానే ఉన్నా, కార్బన్‌డయాక్సైడు కరిగి ఉండడంతో నురగతో, తెల్లగా ఉంటుంది.

www.bhaskerdesh.in