Wednesday 11 May 2016

డాల్ఫిన్లు వాసన చూడలేవా?

డాల్ఫిన్లు వాసన చూడలేవా?

సముద్ర జలాల్లో నివసించే డాల్ఫిన్లు
'సెటాషియన్స్' అనే క్షీరదాల జాతికి చెందినవి. భూగోళంపైన అతి శీతల ప్రాంతాల్లో ఉండే చల్లని సముద్ర జలాలు మొదలుకొని ఉష్ణమండల ప్రాంతంలో ఉండే వెచ్చని జలాల వరకు అన్ని రకాల సముద్ర జలాల్లోనూ మనకు డాల్ఫిన్లు కనిపిస్తాయి. డాల్ఫిన్లలో కిల్లర్‌వేల్, పైలట్, బాటిల్‌నోస్ డాల్ఫిన్ అని విభిన్న రకాలవి ఉన్నాయి. సముద్ర జలాల నీటిలో కలిసిపోయే విధంగా కొన్ని రకాలకు చెందిన డాల్ఫిన్లు తెలుపు - నలుపు రంగులో ఉంటే మరికొన్ని చిక్కని నలుపు రంగులో ఉంటాయి.

సీసామూతిలాంటి ముక్కుతో ఉండే డాల్ఫిన్లు మాత్రం బూడిద రంగులో ఉంటాయి. డాల్ఫిన్ల రకాలను బట్టి 8 అడుగుల నుంచి 20 అడుగుల పొడవు వరకు ఉంటాయి. సాధారణంగా డాల్ఫిన్లు రోజుకి 3 నుంచి 7 మైళ్ల దూరం వరకు ఈదుతాయి. వీటి ముందు భాగం, అలాగే వెనుక భాగం కొనదేలినట్లు ఉండటంతో ఈదేటప్పుడు వీటి శరీరంపైన ముందు నుంచి వెనక్కి నీరు సులభంగా ప్రవహించగలుగుతుంది. ఈ ప్రక్రియ ఈత విషయంలో డాల్ఫిన్లకు బాగా ఉపకరిస్తుంది.
www.bhaskerdesh.in