Friday 13 May 2016

నుదిటిపైన, కనుబొమ్మల మధ్య చూపుడు వేలును నుదుటికి తాకకుండా గుండ్రంగా తిప్పితే అక్కడ నొప్పి పుట్టినట్టనిపిస్తుంది. ఎందుకు?


ప్రశ్న: 
నుదిటిపైన, కనుబొమ్మల మధ్య చూపుడు వేలును నుదుటికి తాకకుండా గుండ్రంగా తిప్పితే అక్కడ నొప్పి పుట్టినట్టనిపిస్తుంది. ఎందుకు?

జవాబు: 
శరీరంలో తల (skull) భాగం చాలా విశిష్టమైంది. ఇందులోనే శరీరం మొత్తాన్ని నియంత్రించే మెదడుతోపాటు పంచేంద్రియాలన్నీ ఉన్నాయి. నుదుటి మీద చూపుడు వేలు దగ్గరగా ఉంచి అటూయిటూ తిప్పినపుడు, ఆ వ్యక్తి అప్రయత్నంగా తన తలకు, కళ్లకు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అన్నట్టు రెండు కళ్లను ఆ వేలి వైపు తిప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే మన కళ్లు రెండూ దృష్టినాడి (optical nerve) ద్వారా అనుసంధానం కావడం వల్ల అవి ఎపుడూ ఒకేవైపు కలిసి తిరుగుతూ ఉంటాయి. ఇది నొప్పి (strain)లేని ప్రక్రియ. కానీ కళ్లకు దగ్గరగా చూపుడు వేలు తిప్పేటప్పుడు రెండు కళ్లూ కనుబొమ్మల మధ్యకు (అంటే కుడికన్ను ఎడమవైపునకు, ఎడమకన్ను కుడివైపునకు కొద్దిగా) తిరగాలి. ఇది అసహజ ప్రక్రియ. అందువల్ల కనుబొమ్మలు ఇబ్బంది (strain) పడతాయి..
www.bhaskerdesh.in