Friday 6 May 2016

ఫ్యానుకు సాధారణంగా మూడు రెక్కలే ఉంటాయి. ఎందుకు?

DB
ప్రశ్న: ఫ్యానుకు సాధారణంగా మూడు రెక్కలే ఉంటాయి. ఎందుకు  ?






జవాబు: ఫ్యానుకు ఒకే రెక్క ఉండడం వీలు కాదు కాబట్టి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగని రెక్కలు మరీ ఎక్కువయితే వాటి మధ్య ఎడం తక్కువైపోతుంది. ఫ్యాను చేసే పనే తన వెనుక గాలిని రెక్కల ద్వారా ముందుకు నెట్టడం. అలాంటప్పుడు రెక్కల మధ్య ఎడం తక్కువైతే గాలి త్వరితంగా ముందు వైపునకు రాలేదు. కాబట్టి మధ్యే మార్గంగా మూడు రెక్కలతో సర్దుకోవడం ఆనవాయితీ. పెద్దపెద్ద సభల్లోనూ, పెళ్లిపందిళ్లలోనూ తీవ్రమైన వేగంతో గాలిని దూరంగా నెట్టే తుపాన్‌ ఫ్యాన్లకు రెండే రెక్కలు ఉంటాయని గమనించండి. కొన్నిచోట్ల నాలుగు రెక్కల ఫ్యాన్లు కూడా ఉంటాయి. బాత్‌రూంలు, వంటగదులు వంటి గదుల్లోంచి అవాంఛనీయ వాయువుల్ని బయటికి నెట్టే (exhaust) ఫ్యాన్లకు ఐదు, లేదా ఆరు రెక్కలు కూడా ఉండడం కద్దు. సైద్ధాంతికంగా ఫ్యాను రెక్కలు ఒకటికన్నా ఎక్కువ ఉండాలన్నదే రూఢి అయిన విషయం. ఇక వేగం, అవసరాల ఆధారంగా రెక్కల సంఖ్య మారుతూ ఉంటుంది.
www.bhaskerdesh.in