Saturday 23 July 2016

గరాటుతో ఒక సీసాను నీటితో నింపేప్పుడు తరచూ గరాటును కొంచెం పైకి ఎత్తవలసి వస్తుంది. ఎందుకు?

ప్రశ్న: గరాటుతో ఒక సీసాను నీటితో నింపేప్పుడు తరచూ గరాటును కొంచెం పైకి ఎత్తవలసి వస్తుంది. ఎందుకు?

జవాబు: గాలి, నీరు ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉండే ప్రదేశంలోకి ప్రవహిస్తాయి. సీసా మూతిపై గరాటును పెట్టి నీరు పోసినప్పుడు కొంత నీరు సీసాలోకి పడుతుంది. అంతవరకు అక్కడున్న గాలి సీసాలోంచి తప్పించుకుపోడానికి గరాటు అడ్డంగా ఉండడంతో నీటిలో కలిసిపోతుంది. అలా నీరు పోసేకొలదీ, సీసాలోని గాలి నీటిలో కలిసిపోతుండంతో ఒక దశలో సీసా బయట ఉండే గాలి పీడనం కన్నా, సీసాలోని పీడనం ఎక్కువవుతుంది. అందువల్ల ఆపై గరాటులో పోసే నీరు లోపలికి దిగకుండా ఈ పీడనం నిరోధిస్తుంది. అప్పుడు గరాటును కొంచెం పైకి ఎత్తితే సీసాలోని గాలి కొంత బయటకు తప్పించుకుపోతుంది. అప్పుడు సీసాలోపలి పీడనం బయటి పీడనం కన్నా తక్కువ అయి నీరు సాఫీగా దిగుతుంది.