Wednesday 27 July 2016

కేవలం గాలిని ఉపయోగించి కారుని నడిపారని పత్రికల్లో చదివాను. ఇదెలా సాధ్యం?

ప్రశ్న: కేవలం గాలిని ఉపయోగించి కారుని నడిపారని పత్రికల్లో చదివాను. ఇదెలా సాధ్యం?

జవాబు: సాధారణంగా వాహనాలు పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాలలోని రసాయనిక శక్తిని తమ అంతర్దహన యంత్రాంగం (internal combustion mechanism) ద్వారా యాంత్రిక శక్తిగా మార్చుకుని పని చేస్తాయి. ఈమధ్య వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ యాంత్రిక పద్ధతుల్లో వాహనాలను నడిపే ప్రక్రియలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటివే ఈ వాయు చోదక వాహనాలు. మామూలు గాలిని ప్రత్యేక మోటార్ల ద్వారా సిలండర్లలో అధిక పీడనంతో నింపుతారు. వీటి మూతులకు ప్రత్యేకమైన రెగ్యులేటర్లను అమర్చడం ద్వారా కావలసిన పీడనం, వేగాలతో బయటకి పంపే ఏర్పాటు ఉంటుంది. ఇలా అత్యధిక ఒత్తిడితో బయటకి వచ్చే గాలి టర్బైన్‌ను తిప్పే విధంగా అమరిక ఉంటుంది. అంటే వాయుశక్తి యాంత్రిక శక్తిగా మారుతోందన్నమాట. ఈ టర్బైన్‌కు అనుసంధానంగా చక్రాల ఇరుసులను అమర్చడం వల్ల అవి తిరిగి కారు ముందుకు కదులుతుంది. ఇలాంటి ఇంజిన్లను వాయుచలన యంత్రాలు (Pneumatic engines) అంటారు.

www.bhaskerdesh.in