Thursday 14 July 2016

నైట్రస్‌ ఆక్సైడు వాయువును నవ్వు పుట్టించే వాయువు అంటారు. దాన్ని పీలిస్తే నిజంగా నవ్వు వస్తుందా?

ప్రశ్న: నైట్రస్‌ ఆక్సైడు వాయువును నవ్వు పుట్టించే వాయువు అంటారు. దాన్ని పీలిస్తే నిజంగా నవ్వు వస్తుందా?

జవాబు: నైట్రస్‌ ఆక్సైడు (N2O)వాయువుకి రంగు ఉండదు. పీలిస్తే హాయిగా అనిపిస్తుంది. రుచికి తీయగా ఉంటుంది. నవ్వు పుట్టించే వాయువు (లాఫింగ్‌ గ్యాస్‌) అనే పేరున్నప్పటికీ దీన్ని పీలిస్తే ఎవరికీ నవ్వు రాదు. అయితే దీన్ని పీల్చినప్పుడు మత్తు కలుగుతుంది. అందుకే వైద్యులు రోగులకు శస్త్రచికిత్స చేయడానికి ముందు ఈ వాయువును ఉపయోగించి మత్తు కలిగిస్తారు. ఆందోళన, నొప్పి భావనలతో కాకుండా ఆహ్లాదకరమైన భావనతో మత్తులోకి పోయేలా చేయడం వల్ల దీనికా పేరు వచ్చింది. అంతేతప్ప దీన్ని పీల్చినవారంతా విరగబడి నవ్వుతారని అనుకోకూడదు.